Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పిజ్జా, బర్గర్‌లు దీని ముందు పరార్.. నోట్లో ఇట్టే కరిగిపోయేలా ఆలూతో ఎగ్ బజ్జీ.!
ఎగ్ బజ్జీ, ఆలూ బజ్జీ ఇలా విడివిడిగా బోండాలు తిని ఉంటారు. కానీ ఈ రెండింటి కాంబినేషన్‌తో ఎప్పుడైనా బజ్జీ టేస్ట్ ట్రై చేశారా.? తలచుకుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి కదా.. అటు హెల్తీగా ఇటు ఒక్క బోండాతోనే కడుపు నిండేలా త్వరగా చేసుకునేలా ఆలూ ఎగ్ చాప్స్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం..

ఆలూ ఎగ్ చాప్స్‌కి కావాల్సిన పదార్థాలు
కోడిగుడ్లు- నాలుగు
బంగాళాదుంప- నాలుగు
పచ్చిమిర్చి- నాలుగు
శనగపిండి- కప్పు
కొత్తిమీర- అరకప్పు
ఉప్పు- తగినంత
కారం- టీస్పూన్
ధనియాల పొడి- టీస్పూన్
ఉల్లిపాయ- ఒకటి
పసుపు- పావు టీ స్పూన్
చాట్ మసాలా- టీస్పూన్
నూనె- డీప్ ఫ్రై కోసం
తయారీ విధానం
-ముందుగా కోడిగుడ్లను ఉడికించి పెట్టుకోవాలి. మరో గిన్నెలో బంగాళాదుంపలను ఉడికించుకోవాలి. కోడిగుడ్లను పొట్టు తీసి ఒక్కో గుడ్డును నాలుగు సమభాగాలుగా పొడవుగా కట్ చేసుకుని ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన బంగాళాదుంపల పొట్టు తీసి ఒక గిన్నెలోకి తీసుకుని మెత్తగా మాష్ చేసుకోవాలి. అందులో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, ఉల్లిపాయ, కొత్తిమీర వేసి కలుపుకొని స్టఫ్‌లాగా చేసుకోవాలి.
-ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కోడి గుడ్లను బంగాళాదుంప స్టఫ్‌తో పూర్తిగా కప్పేసుకోవాలి. తర్వాత ఓ గిన్నెలో శనగ పిండిని వేసుకుని అందులో కొద్దిగా ఉప్పు, కారం, ధనియాలపొడి, చాట్ మసాలా, కొన్ని నీళ్లు పోసుకుని కొంచెం లూజ్‌గా కలుపుకోవాలి.
-చివరిగా ఓ బాణలిలో నూనె పోసి వేడయ్యాక.. ఎగ్ చాప్స్‌ను శనగపిండిలో ముంచి ఆయిల్‌లో వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటినీ చేసుకోవాలి. అంతే టేస్టీ ఆలూ ఎగ్ చాప్స్ రెడీ. వీటిని టొమాటో సాస్ లేదా గ్రీన్ చట్నీతో తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. సాయంత్రం వెరైటీ స్నాక్స్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్..
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications