Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
ఈ దోశ పిల్లలకు పెడితే.. ముక్క మిగిల్చకుండా మొత్తం నాకేస్తారు, ఎలా చేసుకోవాలంటే?
గుడ్డు వంటకాలు అంటే పిల్లలకు చాలా ఇష్టం ఉంటుంది. గుడ్డుతో ఎలాంటి వంట చేసినా వారు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ ప్రతిసారీ ఆమ్లెట్ లేదా ఉడికించిన గుడ్డు ఇస్తే వారిలో దానిపై ఆసక్తి లేకుండా పోతుంది. మళ్ళీ దానివైపు చూడాలనే ఆశ కూడా పిల్లల్లో కలగదు. అందుకే అదే రుచిలో చిన్న మార్పులతో, కొత్త టచ్‌తో వంట చేస్తే మాత్రం వాళ్లు చక్కగా తినేస్తారు. అలాంటి వంటకం ఏదైనా ఉందా? అని అనుకుంటున్నారా? ఉందండీ అతి తక్కువ సమయంలో తయారయ్యే "ఎగ్ రోల్ దోసా". ఈ రిసిపీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది, పిల్లల జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది, ఫస్ట్ బైట్కి వాళ్ల నోరూరేలా చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం!

ఎగ్ రోల్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు:
గోధుమ పిండి - 1 టేబుల్ స్పూన్
మిరియాల పొడి - చిటికెడు
చిల్లీ ఫ్లేక్స్ - చిటికెడు
కొత్తిమీర - తరిగినదిగా కొద్దిగా
గుడ్డు - 1
ఉప్పు - రుచికి తగినంత
నీరు - అవసరమైనంత
చీజ్ లేదా నెయ్యి - తవా పై వేసేందుకు
తురిమిన చీజ్ (ఐచ్ఛికం) - రోల్ కోసం
వేసవిలో పర్ఫెక్ట్ కూర ఇదే.. దీనితో అన్నం తింటే కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు, ఎలా చేసుకోవాలంటే?
ఎగ్ రోల్ దోశ తయారీ విధానం:
ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకుని, దానిలో ఉప్పు, మిరియాల పొడి,
చిల్లీ ఫ్లేక్స్ కలపాలి.
ఇప్పుడు కొద్దిగా నీరు పోసి మిశ్రమాన్ని చిక్కగా కలపాలి.
అందులో తరిగిన కొత్తిమీర, పగలగొట్టిన గుడ్డును వేసి బాగా
గిలక్కొట్టాలి.
ఈ మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.
ఇప్పుడు పాన్‌ను వేడి చేసి, దానిపై కొద్దిగా నెయ్యి లేదా
చీజ్ వేయాలి.
మిశ్రమాన్ని తవా మీద దోస మాదిరిగా వేసి రెండు వైపులా బాగా
వేయించాలి.
దోస పూర్తిగా వేగిన తరువాత, తురిమిన చీజ్ వేసి గట్టిగా రోల్
చేయాలి.
చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పిల్లలకి అందించండి. కావాలంటే టొమాటో
సాస్‌తో సర్వ్ చేయవచ్చు.
కొన్ని చిట్కాలు:
గుడ్డు మేనిదే తినలేని వారు, మినపపిండి మిశ్రమాన్ని వాడవచ్చు.
చీజ్‌కు బదులుగా తురిమిన పన్నీర్ వాడితే ఆరోగ్యపరంగా ఇంకా మంచిది.
గోధుమ పిండికి బదులుగా శెనగపిండి వాడినా, రుచి అదిరిపోతుంది.
పోషక విలువలు & లాభాలు:
గుడ్డులో ఉన్న ప్రోటీన్ పిల్లల ఎదుగుదలకి ఉపకరిస్తుంది.
విటమిన్ B12, ఐరన్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
గోధుమ పిండి ఫైబర్ అధికంగా ఉండి, జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.
కొత్తిమీరలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో టాక్సిన్లను తొలగించేందుకు
తోడ్పడతాయి.
చీజ్ లేదా పన్నీర్ వల్ల కాల్షియం, శక్తి మరియు ప్రోటీన్
అందుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
