Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
పంక్షన్స్ లో వడ్డించే వెజిటేబుల్ పులావ్..ఇంట్లో ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు
పెళ్లిళ్లు లేదా ఇతర పంక్షన్లలలో ఖచ్చితంగా వడ్డించే ఫుడ్ ఐటమ్ వెజిటేబుల్ పులావ్. చాలామందికి బిర్యానీ అంతే ఇష్టముండదు కానీ పులావ్ అంటే మాత్రం ఎగబడి మరీ తింటారు. కొంచెం నాలుకకి వెజ్ పులావ్ తగిలిందంటే చాలు ఆహా ఏమి రుచిరా అని మైమరిచిపోతారు. వేజిటేబుల్ పులావ్ ని కొంతమంది ఇళ్లల్లో ట్రై చేస్తుంటారు కానీ పంక్షన్ లలో వడ్డించే పులావ్ టేస్ట్ రాదు. దీనికి కారణం వండే విధానమే. వేజిటేబుల్ పులావ్ ని ఇంట్లోనే ఈజీగా పంక్షన్ లలో వడ్డించే మాదిరి టేస్టీగా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
వెజిటేబుల్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-బాస్మతి బియ్యం
-మిల్ మేకర్
-పచ్చి బఠానీ
-టమాటొ
-ఉల్లిపాయ
-జీడిపప్పు
-బంగాళదుంప
-బీన్స్
-క్యారెట్
-నెయ్యి
-ఆయిల్
-పుదీనా
-పచ్చిమిర్చి
-కరివేపాకు
-అల్లం
-వెల్లుల్లి
-జీలకర్ర
-యాలకలు
-అనాన పువ్వు
-బిర్యానీ ఆకు
-షాజీరా
-దాల్చిన చెక్క
-లవంగ మొగ్గ
-ధనియాల పొడి
-ఉప్పు

వెజిటేబుల్ పులావ్ తయారీ విధానం
-ముందుగా ఓ బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బాస్మతి రైస్ పోయండి. రైస్ ని శుభ్రంగా కడిగిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టండి.
-తర్వాత స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి అందులో అరలీటర్ నీళ్లు పోసి మరిగించండి. కొద్దిగా మరిగినప్పుడే అందులో పావుకప్పు మిల్ మేకర్ వేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి.
-ఇప్పుడు ఆ బౌల్ లోనే కూల్ వాటర్ పోయండి. చల్లారిన తర్వాత మిల్ మేకర్ ని చేతిలోకి తీసుకొని గట్టిగా పిండి తర్వాత వాటిని ఓ బౌల్ లో వేసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత మిక్సీ గిన్నెలో 5 పచ్చిమిర్చి,1 టేబుల్ స్పూన్ ముక్కలుగా కట్ చేసిన అల్లం,చిన్న ముక్కలుగా కట్ చేసిన 1 మీడియం సైజ్ టమాటో,2 టేబుల్ స్పూన్ల పుదీనా,10 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి ముతకగా గ్రైండ్ చేసి పక్కనపెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఓ కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్,1 టేబుల్ స్పూన్ నెయ్యి పోసి వేడి చేయండి. కొంచెం వేడెక్కాక అందులో 1 టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా(దాల్చిన చెక్క,అనాస పువ్వు,లవంగ మొగ్గలు,యాలకులు)వేయండి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 15 జీడిపప్పు పలుకులు, సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ తరుగు, కొంచెం కరివేపాకు వేసి వేయించండి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన 1 క్యారెట్ ముక్కలు,పావు కప్పు మీడియం సైజ్ లో కట్ చేసిన బీన్స్ ముక్కలు, పావు కప్పు మీడియం సైజ్ లో కట్ చేసిన బంగాళదుంప ముక్కలు,పావు కప్పు పచ్చి బఠానీ, చిటికెడు ఉప్పు వేసి కలిపి మూతపెట్టి మగ్గించండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఓ గిన్నె లేదా కుక్కర్ పెట్టి ఎసరుకు సరిపడా అంటే ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పోసి,కొద్దిగా షాజీరా,1 బిర్యానీ ఆకు, సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర వేసి మూతపెట్టి మంటను మీడియం ప్లేమ్ మీద పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద కడాయిలో ఉడుకుతున్న కూరగాయలు 80 శాతం వరకు మగ్గిన తర్వాత అందులో ఉడికించి పక్కనపెట్టుకున్న మిల్ మేకర్ వేసి 2 నిమిషాలు కలుపుతూ వేయించండి. తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ని ఇందులో వేసి కలపండి. బాగా మగ్గిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపి అందులోనే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి అన్నీ కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఇందులో పక్కన మరిగిస్తున్న ఎసరు నీళ్లను పోసి మూత పెట్టేయండి.
-మంటను లో ప్లేమ్ మీద పెట్టి అడుగున్న ఉన్న నీరు అంతా ఇగిరిపోయేంతవరకు కుక్ చేయాలి. అంతే వేడి వేడి వెజిటేబుల్ పులావ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications