Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Gobi Fried Rice: ఫాస్ట్ ఫుడ్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్.. ఇలా చేసుకొని తింటే రుచి అదిరిపోతుంది!
పిల్లల నుండి పెద్దల వరకు, ప్రతి ఒక్కరూ రోడ్‌సైడ్ స్నాక్స్‌ను ఇష్టపడతారు. చాలా మంది స్ట్రీట్ ఫుడ్‌ని ఇష్టమొచ్చినట్లు తింటుంటారు. పానీపూరీ, గోబీ మంచూరి, ఎగ్ రైస్, బోండా, ఫ్రైడ్ స్నాక్స్, నూడుల్స్ ఇలా ఎన్నో నోరూరించే వంటలను ఆరగిస్తుంటారు. అందులో అందరూ ఎంతో ఇష్టంగా, ఇష్టపడుతూ తినేది గోబీ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. పైగా ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. అయితే ఈ రుచికరమైన గోబీ రైస్‌ను ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గోబీ రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు
- బియ్యం - 1 కప్పు
- కాలీఫ్లవర్
- గరం మసాలా
- ఉప్పు
- రెడ్ చిల్లీ సాస్
- సోయా సాస్
- అల్లం వెల్లుల్లి పేస్ట్
- నల్ల మిరియాల పొడి
- మొక్కజొన్న పిండి
- మైదా పిండి
- అల్లం
- వెల్లుల్లి
- పచ్చి మిరపకాయలు
- ఉల్లిపాయ
- క్యాప్సికమ్
- క్యాబేజీ
- కొత్తిమీర
- నూనె
గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలి?
ముందుగా ఒక గిన్నెలో మొక్కజొన్న పిండి, మైదా పిండి వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి పిండిలా చేసుకోవాలి. తర్వాత గోబీ చేయడానికి కావలసిన సైజులో కాలీఫ్లవర్‌ను వేడి నీటిలో వేసి కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఆ పిండిలో వేసుకున్న క్యాలిఫ్లవర్‌ను బాగా కలుపుకోవాలి. ఆ తరువాత క్యాలీఫ్లవర్‌ను కాసేపు నానబెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక బాణీ పెట్టుకోవాలి. ఆ తరువాత అందులో నూనె పోసుకొని పిండి కలుపుకున్న క్యాలీఫ్లవర్‌ను ఫ్రై చేసుకోవాలి. అలా అన్ని క్యాలీఫ్లవర్‌ను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు కడాయిలో నూనె వేసి వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యాబేజీ వేసి 2 నిమిషాలు వేయించాలి. తర్వాత రెడ్ చిల్లీ సాస్, సోయాసాస్ వేసి వేయించాలి. తర్వాత అందులో వేయించిన గోబీ వేసి వేయించాలి. ఒక నిమిషం తర్వాత ముందుగా చేసుకున్న అన్నం వేసి వేయించాలి. దీనికి గరం మసాలా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల రుచి కూడా బాగుటుంది. మసాలాలు వేసుకున్న తరువాత అన్నాన్ని కాసేపు వేయించుకుంటే గోబీ ఫ్రైడ్ రైస్ సిద్ధమైనట్లే. దీనిపై ఒక నిమ్మకాయ పిండుకొని తింటే రుచి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications