Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పోషకాల గని.. గోదావరి జిల్లాల స్పెషల్ ‘తోటకూర కాడల పులుసు’.. ఎలా చేయాలంటే.!
సాధారణంగా ఆకుకూరలు ఏవైనా సరే కాడలు తీసేసి ఆకులను కట్ చేసి కూర చేసుకుంటాం. కాడలను పారేస్తాం. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం తోటకూర కాడలతో పులుసు చేయడం చాలా స్పెషల్. మర్యాదలకి ఏ మాత్రం తీసిపోని గోదావరి జిల్లాల్లో వెజ్ వంటకాలు ఎంతో స్పెషల్. మరి ఆ ప్రత్యేకమైన తోటకూర కాడల పులుసు ఎలా చేయాలో చూద్దాం.

తోటకూర కాడల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు
తోటకూర కట్ట- ఒకటి
ఉల్లిపాయ- ఒకటి
టొమాటో- రెండు
చింతపండు- నిమ్మకాయ సైజు
జీలకర్ర, ఆవాలు- టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు- పది
పచ్చిమిర్చి- రెండు
కరివేపాకు- రెండు రెబ్బలు
కారం- టీ స్పూన్
ఉప్పు- తగినంత
ధనియాల పొడి- టీ స్పూన్
నూనె- టేబుల్ స్పూన్
తోటకూర కాడల పులుసు తయారీ విధానం
ముందుగా తోటకూర కట్టని తీసుకుని అందులో ఆకులను ఒలిచి పక్కన పెట్టుకుని కాడలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ వేసి వేగాక పచ్చిమిర్చి, కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. కాస్త వేగాక ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి మెత్తగా ఉడకనివ్వాలి.
ఇప్పుడు అందులో కారం, ఉప్పు వేసి ఉడికిన తర్వాత తోటకూర కాడలు వేసి ఉడకనివ్వాలి. కాడలు కొంచెం మెత్తగా అయిన తర్వాత చింతపండు రసాన్ని వేసి కలుపుకోవాలి. కూరలో పులుసు చిక్కగా అయ్యే వరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి ఈ తోటకూర కాడల పులుసు సర్వ్ చేసుకుంటే అటు రుచితో పాటు ఇటు పోషకాలు అందుతాయి.
తోటకూర కాడల్లో పోషకాల గని
తోటకూర కాడల్లో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మెరుగ్గా ఉంటాయి. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలో హానికరమైన కొవ్వులను తగ్గిస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. శరీరంలో రక్తం ఉత్పత్తికి దోహదపడుతుంది. ఇందులోని కాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా మారుస్తుంది. కాడల్లోని విటమిన్-ఎ, సి, కె కంటి చూపు, రోగనిరోధక శక్తి, ఎముకల దృఢత్వానికి దోహదపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు బాడీలోని ఫ్రీ రాడికల్స్‌ను తరిమికొడతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications