బ్యాచ్‌లర్స్‌ సైతం సింపుల్‌గా చేసుకునేలా గోంగూర చికెన్‌ బిర్యానీ.. ప్లేట్‌ ఖాళీ చేయాల్సిందే.?

Posted By:

గోంగూర చికెన్‌, చికెన్‌ బిర్యానీ.. వీటిని ఇష్టపడని వారుండరు. గోంగూరలోని పుల్లదనం, బిర్యానీలోని స్పైసీనెస్‌ తలచుకుంటే చాలు నోరూరిపోతుంటుంది. వీటిని విడివిడిగానే తిని ఉంటారు. కానీ ఈ రెండింటి కాంబినేషన్‌ ఎప్పుడైనా టేస్ట్‌ చేశారా.? రెండు రుచులను కలిపి ఆస్వాదిస్తే వచ్చే మజానే వేరు. పెద్దగా హడావుడి లేకుండా బ్యాచ్‌లర్స్‌ సైతం సింపుల్‌గా చేసుకునే గోంగూర చికెన్‌ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.

how to make gongura chicken biryani simple process in telugu

గోంగూర చికెన్‌ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు

గోంగూర- మీడియ సైజ్‌ కట్ట ఒకటి
చికెన్‌- కేజీన్నర
కారం- తగినంత
ఉప్పు- తగినంత
పసుపు- పావు టీ స్పూన్‌
గరం మసాలా- టీ స్పూన్‌
మసాలా దినుసులు- తాలింపులోకి
పచ్చిమిర్చి- 3
ఉల్లిపాయ- ఒకటి
బిర్యానీ రైస్‌- అరకేజీ
నూనె- మూడు టేబుల్‌ స్పూన్లు

గోంగూర చికెన్ బిర్యానీ తయారీ విధానం

-ముందుగా గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక గోంగూర, పచ్చిమిర్చిని వేసి దగ్గరికి అయ్యేవరకు మగ్గనివ్వాలి. చల్లారాక మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత చికెన్‌ను కడిగి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి కలిపి కాసేపు మారినేట్‌ చేసుకోవాలి. బిర్యానీ కోసం బాస్మతి బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి.

-ఇప్పుడు ఓ వెడల్పాటి గిన్నెలో నూనె పోసి వేడయ్యాక మసాలా దినుసులు వేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగిన తర్వాత చికెన్‌ను వేసి ఉడకనివ్వాలి. ఓ పదినిమిషాల తర్వాత గోంగూర పేస్ట్‌ వేసి మరోసారి కలపాలి. పదినిమిషాల పాటు ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.

-మరో వెడల్పాటి గిన్నెలోకి నాలుగు గ్లాసుల నీళ్లు పోసి మసాలా దినుసులు వేసి మరగనివ్వాలి. ఇప్పుడు అందులో బాస్మతి బియ్యం, తగినంత ఉప్పు వేసి ఉడకనివ్వాలి. 70 శాతం ఉడికిన తర్వాత జల్లెడతో రైస్‌ను చికెన్‌పై పేర్చాలి. పైనుంచి కొద్దిగా కొత్తిమీర, నెయ్యి వేసి మూతపెట్టాలి. ఓ పదిహేను నిమిషాల పాటు మంటను సిమ్‌లో ఉంచాలి. ఆ తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసి కాసేపు అలాగే ఉంచాలి. ఇంకేముంది సింపుల్‌ అండ్‌ టేస్టీ గోంగూర చికెన్‌ బిర్యానీ రెడీ.

-వేసవి సెలవుల్లో సడెన్‌గా ఇంటికి బంధువులు వచ్చినా.. పిల్లలు బిర్యానీ కావాలని మారాం చేసినా ఈ డిష్‌ మంచి ఆప్షన్‌. ఎక్కువగా శ్రమ పడకుండా ఈ సారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఇంటిల్లిపాదీ ప్లేట్లు ఖాళీ చేయాల్సిందే.

[ of 5 - Users]
Desktop Bottom Promotion