Latest Updates
-
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక
గుజరాత్ స్పెషల్ వంట మేతీ థెప్లాస్, చపాతీల కంటే వందరెట్లు బెటర్, ఎలా చేసుకోవాలంటే?
గోధుమ పిండితో ఎప్పుడూ చపాతీలే తింటుంటారు. చాలా మంది వాటినే తినడానికి ఇష్ట పడుతుంటారు. కానీ మీరెప్పుడైనా గోధుమ పిండితో చేసే మేతీ థెప్లాస్ తిన్నారా?. ఇది గుజరాతీల చాలా స్పెషల్ వంటకం. దీనిని గుజరాత్లో ఎక్కువగా చేసుకొని తింటుంటారు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. కానీ చాలా మందికి దీనిని ఎలా చేసుకోవాలో తెలియదు. అందుకే ఈ స్టోరీలో ఈ మేతీ థెప్లాస్ ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేతీ థెప్లాస్ తయారీకి కావలసిన పదార్థాలు:
గోధుమ పిండి - 2 కప్పులు
మెంతి ఆకులు - 1 కప్పు (సన్నగా తరిగినవి)
పెరుగు - 1/4 కప్పు
శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు
అల్లం - 1 టీస్పూన్ (తురిమినది)
పచ్చిమిర్చి - 1 టీస్పూన్ (సన్నగా తరిగినవి)
పసుపు - 1/2 టీస్పూన్
కారం - 1/2 టీస్పూన్
ధనియాల పొడి - 1/2 టీస్పూన్
జీలకర్ర పొడి - 1/4 టీస్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్లు (పిండి కలపడానికి), కాల్చడానికి సరిపడా
ఉప్పు - రుచికి సరిపడా

తయారుచేసే విధానం:
- ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి, శనగపిండి, మెంతి ఆకులు, అల్లం, పచ్చిమిర్చి, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
- తర్వాత పెరుగు, నూనె వేసి బాగా కలపాలి.
- కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ మెత్తని పిండిలా కలుపుకోవాలి.
- పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, ఒక్కొక్క ఉండను చపాతీలా ఒత్తుకోవాలి.
- పెనం వేడి చేసి, ఒత్తుకున్న థెప్లాను వేసి రెండు వైపులా నూనె వేస్తూ బంగారు రంగు వచ్చేవరకు కాల్చాలి. అంతే మేతీ థెప్లాస్ సిద్ధమైనట్లే.
- వేడి వేడి థెప్లాస్ను పెరుగు లేదా ఊరగాయతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications