Latest Updates
-
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్‌తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే..
ఈ స్టైల్లో గుంత పొంగనాలను ఎప్పుడైనా చేసుకున్నారా..?

గుంత పొంగనాల కోసం కావాల్సిన వంట సామాగ్రి
1 కప్పు బొంబాయ్ రవ్వ
అరకప్పు ఉల్లిపాయలు
4 పచ్చిమిరపకాయలు
ఒక మీడియం సైజు టమాటా
పావు కప్పు వరకు తురిమిన క్యారెట్
2 టేబుల్ స్పూన్ల క్యాప్సికం ముక్కలు
2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర
రుచికి సరిపడ ఉప్పు
పావు టీస్పూన్ వంట సోడా
అరకప్పు పెరుగు
అరకప్పు కొబ్బరిముక్కలు
అర ఇంచు అల్లం ముక్కలు
3 పచ్చిమిరపకాయలు
సగం ఉల్లిపాయ ముక్కలు
2 టేబుల్ స్పూన్ల పుట్నాలు
1 టేబుల్ స్పూన్ కొత్తిమీర
నిమ్మకాయ
1/2 టేబుల్ స్పూన్ మంచి నూనె
జీలకర్ర, ఇంగువ, ఆవాలూ, పసుపు, కరివేపాకులు

గుంత పొంగనాలు తయారు చేసే విధానం
గుంత పొంగనాలు తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు బొంబాయ్ రవ్వను వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న అరకప్పు ఉల్లిపాయలను వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజు టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులొనే పావు కప్పు వరకు తురిమిన క్యారెట్‌ను వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల వరకు కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలను కూడా వేసుకోవాలి.
కొత్తిమీర కూడా రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. పావు టీస్పూన్ వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. అరకప్పు పెరుగు వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకుంటూ వుండాలి. బౌల్‌కు మూత పెట్టి 5 నిమిశాల వరకు అలాగే వదిలివేయాలి.
అరకప్పు కొబ్బరిముక్కలను మిక్సీ జార్లో వేసుకోవాలి. అర ఇంచు అల్లం ముక్కలను కూడా వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. సగం ఉల్లిపాయను చిన్న ముక్కలుగా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పుట్నాలను వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి.
రుచికి సరిపడ ఉప్పు, కావలసినంత నీళ్లు పోసుకొని అరచెక్క నిమ్మకాయను పిండుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని తాలింపు పెట్టుకోవాలి. కేవలం 3 నిమిశాల్లో మీకు ఈ చట్నీ రెడీ అయిపోతుంది.
ఇప్పుడు కలిపిపెట్టుకున్న రవ్వ కొంచం గట్టిగా అవుతుంది. ఈ రవ్వకు కూడా కొంచం తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు మంచి నూనెను వేసుకోవాలి. నూనె వేడయిన తరువాత జీలకర్ర, ఇంగువ, ఆవాలు, చిటికెడు పసుపు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకులను వేసుకోవాలి. ఈ పోప్‌ను పొంగనాల కోసం కలిపిపెట్టుకున్న రవ్వలో వేసి బాగా కలుపుకోవాలి.
పొంగనాల కోసం ప్యాన్‌ను పెట్టుకొని అందులో కొద్దిగా నూనె పోసి పొంగనాల గుంతలను కలిపిపెట్టుకున్న వాటితో ఫిల్ చేయాలి. మూత పట్టి 3 నిమిశాల వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలి. మూత తీసి పొంగనాలను మరోవైపుకు తిప్పుకొని మళ్లీ మూత పెట్టి రెండు నిమిశాల వరకు ఉడికించాలి.
ఇక మూత తీసిన తరువాత క్రిస్పీగా అయిన గుంత పొంగనాలను మనం చూడవచ్చు. చట్నీతో సర్వ చేసుకుంటే చాలా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications