Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.!
కూరల్లో వంకాయ వంటి కూర లేదంటారు. వేడుక ఏదైనా వంకాయ కాంబినేషన్ లేనిదే వడ్డన ఉండదు. అంతలా తెలుగు వంటకాల్లో వంకాయ ప్రసిద్ధి చెందింది. పుష్కలంగా పోషకాలు ఉన్న వంకాయతో రకరకాల వంటకాలు చేస్తుంటాం. అయితే ఎప్పుడైనా బ్రింజాల్తో పప్పు ఇగురు చేశారా.? గుంటూరు స్పెషల్ వంకాయ పప్పు ఇగురు ఇష్టపడని వారుండరు. చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఈ ప్రత్యేక వంటను ఎలా చేయాలో చూద్దాం..

వంకాయ పప్పు ఇగురుకి కావాల్సిన పదార్థాలు
పొడుగు వంకాయలు- అర కేజీ
పచ్చిమిర్చి- పది
కందిపప్పు- ఒక కప్పు
చింతపండు- నిమ్మకాయ సైజు
పచ్చి కొబ్బరి ముక్కలు- పది
నూనె- టేబుల్ స్పూన్
వంకాయ పప్పు ఇగురు తయారీ విధానం
ముందుగా పొడుగు వంకాయలను ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్లలో కడిగి పెట్టుకోవాలి. ఈ లోపు కందిపప్పును కడిగి గంటసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఓ కడాయిలో కొన్ని నీళ్లు పోసి అందులో వంకాయ ముక్కలు వేసి చింతపండు రసం వేయాలి. వంకాయ ముక్కలు 80 శాతం ఉడికేవరకు ఉంచాలి. తర్వాత నీళ్లు వడబోయాలి.
పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలను కలిపి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత వంకాయ ముక్కలను వేసి 5 నిమిషాలు ఉడికించాక నానబెట్టిన కందిపప్పు వేసి మరి కాసేపు ఉడికించాలి. చివరిగా పచ్చిమిర్చి, కొబ్బరి పేస్ట్, ఉప్పు వేసి కలుపుకోవాలి. కందిపప్పు మెత్తగా అయ్యేవరకు మీడియం మంట మీద కాసేపు ఉడకనివ్వాలి. అంతే రుచికరమైన వంకాయ పప్పు ఇగురు రెడీ. వేడివేడి అన్నం లేదా చపాతీలోకి సైడ్ డిష్‌గా ఈ గుంటూరు స్పెషల్ వంకాయ పప్పు ఇగురు పర్ఫెక్ట్గా సరిపోతుంది.
పోషకాలు మెండు
వంకాయ పప్పు ఇగురులో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది సమతుల్య ఆహారంగా పనిచేస్తుంది. ఇందులో 115 నుంచి 150 కేలరీల ఎనర్జీ, 6 నుంచి 7 గ్రాముల ప్రొటీన్ లభిస్తాయి. చాలా తక్కువ మొత్తంలో కార్బొహైడ్రేట్స్(15.9గ్రా) లభిస్తాయి. ఫైబర్ 3.8 గ్రా, కొవ్వులు 3 గ్రాములు, సోడియం 330 మి.గ్రా మొత్తంలో అందడం ద్వారా జీర్ణవ్యవస్థపై అధిక భారం ఉండదు. జీర్ణక్రియ సైతం మెరుగవుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications