Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
నోరూరించే మసాలా గుత్తివంకాయ కర్రీని చెసుకుందామా..? చాలా సింపుల్..!
కూరగాయల్లో రాజుగా వంకాయకు పేరుంది. మసాలా గుత్తి వంకాయంటే నోట్లో లాలాజం ఊరుతుంది. గుత్తివంకాయంటే ఇష్టపడని వారు వుండరు. బగారా అన్నంలో గుత్తివంకాయ కలుపుకొని తింటే బిర్యానీ కన్న అమోఘంగా వుంటుంది. గుత్తివంకాయను ఎలా తయారు చేసుకోవాలో మీకు అందిస్తున్నాం.
గుత్తి వంకాయ తయారు చేసుకోవడానికి కవాలిన వంట సామాగ్రి
600ల గ్రాముల వంకాయలు, మంచి నూనె, ఒక ఉల్లిపాయ, అల్లం, సోయా గ్రాన్యూల్స్, తగినంత ఉప్పు, జిలకర, పసుపు, కొత్తిమీర, పచ్చిమిరకపకాయలు.
-
ప్యాన్‌లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను
తీసుకొని బాగా వేపాలి. మీడియం ఫ్లేమ్‌పైనే పల్లీలను
వేయించాలి. 60 శాతం పల్లీలు బాగా వేపిన తరువాత రెండు టేబుల్ స్పూన్ల
ఎండుకొబ్బర ముక్కలను, మరో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను తీసుకొని
వేపాలి. కొన్ని స్పైసెస్ను కూడా వేసుకొని వేపాలి. చిన్న
దాల్చిన చెక్కల ముక్కలను, లవంగాలను తీసుకోవాలి.

అన్నీ వేగాక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు గుత్తివంకాయ చేయడానికి పావుకేజీ నల్ల వంకాయలను తీసుకోవాలి. గుత్తివంకాయలో మసాలా పెట్టడానికి గుత్తివంకాయను కట్ చేసుకోవాలి. ఒక్కో వంకాయకు నాలుగు గాట్లు పెట్టి ఉప్పు వేసిన నీళ్లల్లో వంకాయలను వేయాలి. అన్ని వంకాయలను కట్ చేసి బౌల్లో వేసుకోవాలి.
ఇంతకు ముందు వేపిన మసాలాను మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీలో బాగా గ్రైండ్ చేసిన తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్‌ను కూడా వేసుకోవాలి. రెండు టీ స్పూన్ల ధనియాల పొడిని కూడా గ్రైండ్ చేసిన పౌడర్‌లో వేసుకోవాలి. రెండు టీ స్పూన్ల కారంను కూడా యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని మొత్తం పౌడర్‌ను కలుపుకోవాలి. కొన్ని నీళ్లను యాడ్ చేసుకొని పేస్ట్‌లా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మసాలా పేస్ట్‌ను వంకాయల్లో ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసిన తరువాత మసాలా కొంత మిగిలిపోయి వుంటుంది. స్టవ్‌పై ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల మంచి నూనెను యాడ్ చేసుకోవాలి, మూడు పచ్చి మిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి, కొన్ని కరివేపాకులును, ఉల్లిపాయలను వేసుకోవాలి, ఒక టీస్పూన్ ఫ్రెష్‌గా దంచిన అల్లం ముక్కలను వేసుకోవాలి. వంకాయలు ఆయిల్లో బాగా ఉడికేవరకూ పెట్టుకోవాలి. నూనెలో వంకాయలను కలుపుతూ బాగా ఉడికేలా చూసుకోవాలి.
వంకాయలోకి మిగిలిపోయిన మసాలాను వేసుకోవాలి. పావుకప్పు చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కోసం కొన్ని నీళ్లను కూడా యాడ్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ప్యాన్‌పై మూత పెట్టాలి. సుమారు 10 నిమిషాల వరకు ఉడకబెట్టాలి. కొన్ని కొత్తిమీర ఆకులను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక దీంతో గుత్తివంకాయు కూర రెడీ అయినట్టే.
ఈ గుత్తివంకాయ కూరను చపాతీతో కూడా కలుపుకొని తినవచ్చు.
వంకాయలో వుండే పోషకాలు
ఒక కప్పు గుత్తివంకాయలో 20 క్యాలరీలు వుంటాయ్. 5 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3గ్రాముల ఫైబర్, ప్రొటీన్ 1 గ్రాము వుంటుంది. గుత్తివంకాయలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెండుగా వుంటాయ్. వంకాయలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని పరిశోధనలో తేలింది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications