Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
Egg Samosa Recipe: కోడిగుడ్డుతో రుచికరమైన సమోసా.. ఇలా సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోవచ్చు!
చాలా మందికి సమోసా అంటే ఇష్టం ఉండే ఉంటుంది. అయితే సమోసా తినాలనుకునేవారు తరచుగా ఆనియన్ సమోసా లేదా మొక్కజొన్న సమోసా లేదా ఆలూ సమోసాను తింటూ ఉంటారు. ఎప్పుడూ అవే సమోసాలను తింటే బోర్ కొడుతూ ఉంటుంది. అందుకే ఈసారి కొత్తగా ఎగ్ సమోసాను ట్రై చేయండి. ఇది రుచికరంగా ఉండడంతో ఉండడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అయితే ఎంతో రుచికరమైన ఈ ఎగ్ సమోసాను ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఏ విధమైన పద్దతిలో ఈ సమోసాను చేసుకోవాలనేది ఈ వివరించాము. పూర్తిగా చదవండి.
ముందుగా ఈ ఎగ్ సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం..

- ఒక కప్పు మైదా పిండి
- రుచికి సరిపడా ఉప్పు
- సమోసా వేయించుకోవడానికి సరిపడా నూనె
- అయిదు ఉడికించిన గుడ్లు
- సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ
- అర టీస్పూన్ జీలకర్ర
- రెండు పచ్చిమిర్చి
- ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- కొద్దిగా కారం
- చిటికెడు పసుపు
- అర టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి
- అర టీస్పూన్ గరం మసాలా
- పావుకప్పు కొత్తిమీర తురుము
- కొద్దిగా మైదాపిండి
ఎగ్ సమోసా తయారీ విధానం..
ఈ ఎగ్ సమోసా తయారు చేసుకోవడానికి ముందుగా మనం చపాతీల కోసం పిండిని సిద్ధం చేసుకోవాలి. అందుకోసం ఒక గిన్నెలో ఒక కప్పు మైదా పిండి, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమానికి కొద్దికొద్దిగా నూనె పోసుకుంటూ ఉండలు లేకుండా మెత్తగా పిండిని కలుపుకోవాలి. తరువాత మరో టీస్పూన్ నూనె వేసి, ఆ పిండిపై మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అయిదు గుడ్లు తీసుకొని బాగా ఉడికించుకోవాలి. గుడ్లు ఉడికిన తరువాత వాటిని పక్కకు తీసి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఎగ్ స్టఫింగ్ కోసం.. స్టవ్‌పై పెనం పెట్టి, అందులో కొద్దిగా నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అదే మిశ్రమంలో మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ముందుగా కోసి పెట్టుకున్న గుడ్డును రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గుడ్డును రెండోవైపు కూడా తిప్పుకొని ఇంకో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోని వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. గుడ్లు చల్లారిన తరువాత వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు అదే ఆయిల్లో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లేత బంగారు వర్ణంలోకి వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఆ తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకొని, స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో కట్ చేసిన గుడ్లు, చిల్లి ఫ్లేక్స్, వేయించిన జీలకర్ర, గరం మసాలా, చాట్ మసాలా, కొద్దిగా ఉప్పు, కొత్తిమీర ఇందులో వేసుకొని గుడ్డు మిశ్రమానికి మంచిగా పట్టే విధంగా కలుపుకుంటే ఎగ్ స్టఫింగ్ సిద్ధమైపోతుంది.
ఇప్పుడు సమోసా సీట్స్ చేయడం కోసం.. ముందుగా కలిపిపెట్టుకున్న మైదా పిండిని ఇంకోసారి బాగా కలుపుకోవాలి. వాటిని నిమ్మకాయ సైజులో ముద్దగా చేసుకోవాలి. వాటిని పొడి మైదా పిండి తీసుకొని వాటిలో ముంచి.. రోటి చేసే పీటపై పెట్టుకొని, ఆ ముద్దపై కొద్దీ కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ రోటీలు చేసుకోవాలి. ఇలా అన్ని చపాతీలు చేసుకోవాలి. రోటీలను చపాతీ పెనంపై కొంచెం నూనె పోసి రెండు వైపులా దోరగా కాచుకోవాలి.
పెనం మీద కాల్చుకున్న రోటీలను సమోసా నింపేందుకు మూడు ఇంచుల వెడల్పు, తొమ్మిది ఇంచుల పొడువు ఉండేలా కట్ చేసుకోవాలి. సమోసాను సీల్ చేసేందుకు ఒక కప్పులో మైదా తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని, షీట్ సీల్ చేసేందుకు వీలుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ సిద్ధమైపోయినట్లే. ఇక సమోసా నింపేసి ఫ్రై చేయడమే బ్యాలెన్స్ ఉంది.
ఒక్క సమోసా సీట్‌ను తీసుకొని దానిని కోన్ షేప్‌లో మలుచుకోవాలి. అందులో ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని.. మూడు వైపులా మైదాతో చేసిన సీల్‌తో స్టఫింగ్ కిందకు పోకుండా సీల్ చేసుకోవాలి. ఇలా అన్ని సమోసాలను చేసుకోవాలి. తరువాత స్టవ్‌పై కడాయి పెట్టి అందులో సమోసాలను ఫ్రై చేసేందుకు కావాల్సిన నూనె పోసుకోవాలి.
నూనె వేడయ్యాక అందులో సమోసాలను వేసుకొని, అవి లేత బంగారు వర్ణంలో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్లో తీసుకొని సర్వింగ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ సమోసా సిద్ధమైపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications