Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఇడ్లీ,దోశలు వేస్ట్..ఇది తింటేనే అసలైన శక్తి..టేస్ట్ కేకో కేక!
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో వేడి వేడి పొంగల్ తినాలని చాలా మందికి ఓ సెపరేట్ క్రేజ్ ఉంటుంది. కానీ, రెగ్యులర్ బియ్యంతో చేసే పొంగల్ తినాలంటే అందులో ఉండే కార్బోహైడ్రేట్స్ వల్ల బరువు పెరుగుతామనే భయం డైట్ చేసేవారిని వెంటాడుతుంది. అయితే ఆ భయాన్ని పక్కనపెట్టి, మీరు ఇష్టపడే పొంగల్ ను ఎంతో ఆరోగ్యంగా, ఎలాంటి గిల్ట్ లేకుండా ఆస్వాదించడానికి మీకోసం ఒక అద్భుతమైన రెసిపీ జొన్న రవ్వ పొంగల్.

రెగ్యులర్ రైస్ బదులు జొన్న రవ్వతో ఈ పొంగల్ ప్రిపేర్ చేస్తే కార్బ్స్ చాలా వరకు తగ్గుతాయి. పైగా ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి మీ వెయిట్ లాస్ జర్నీకి ఇది బెస్ట్ ఆప్షన్. పెసరపప్పు, మిరియాలు, అల్లం కాంబినేషన్లో చేసే ఈ జొన్న రవ్వ పొంగల్ ఆరోగ్యానికి మాత్రమే కాదు, రుచికి కూడా తిరుగుండదు.
జొన్న రవ్వ పొంగల్ తయారీకి కావాల్సిన పదార్థాలు
పొంగల్ ఉడికించడానికి
జొన్న రవ్వ - 1 కప్పు
పెసరపప్పు - పావు కప్పు
నీళ్లు - 3 కప్పులు
నూనె - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
మిరియాలు - 1 టీస్పూన్
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
తాలింపు కోసం
నెయ్యి - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు - కొద్దిగా
అల్లం తురుము - కొద్దిగా
జీడిపప్పు - గుప్పెడు
ఎండుమిర్చి - 2
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - రెండు రెబ్బలు
ఇంగువ - చిటికెడు
జొన్న రవ్వ పొంగల్ తయారీ విధానం
-ముందుగా ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. అందులో ఒక టీస్పూన్ నూనె వేసి వేడి అయ్యాక, జీలకర్ర, మిరియాలు వేసి వేయించాలి.
-ఇప్పుడు అందులో ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు, అరగంట పాటు నానబెట్టిన జొన్న రవ్వ వేసి పచ్చివాసన పోయేలా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత 3 కప్పుల నీళ్లు, చిటికెడు పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కుక్కర్ మూతపెట్టి మీడియం మంట మీద 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి.
-కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత, ఒకసారి మూత తీసి పొంగల్ ను గరిటతో బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు అసలైన రుచినిచ్చే పోపును సిద్ధం చేసుకోవాలి. స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టి అందులో నెయ్యి వేడి చేయాలి. నెయ్యి కరిగాక జీలకర్ర, దంచిన మిరియాలు, సన్నగా తరిగిన అల్లం, జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. ఆ వెంటనే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.
-ఈ ఘుమఘుమలాడే పోపును ఉడికించి పెట్టుకున్న జొన్న రవ్వ పొంగల్ లో వేసి బాగా కలుపుకోవాలి.
-అంతే నోరూరించే ఆరోగ్యకరమైన జొన్న రవ్వ పొంగల్ రెడీ. దీనిని పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ లేదా వేడి వేడి సాంబార్‌తో సర్వ్ చేసుకుంటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications