Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
వన్స్ మోర్ అనిపించే సోయా రైస్..ఇంట్లో ఇలా చేసుకొని ఆస్వాదించండి
టమాటో రైస్,పుదీనా రైస్,జీరా రైస్ రోజూ ఇవే తిని తిని బోరో కొట్టిందా? కొత్తగా ఏదైనా టేస్ట్ చేయాలని మీ నాలుకు ఆరాటపడుతుందా? అయితే ఆలస్యం చేయకుండా సోయా రైస్ చేసేయండి. సోయా రైస్ రుచికరమైన వంటకంవ మాత్రమే కాదండోయ్..ఆరోగ్యానికి కూడా చాలా చాలా మేలు చేస్తుంది. ఇది ప్రోటీన్లు, ఫైబర్ మరియు ఇతర పోషకాలతో నిండి ఉంటుంది. ఇది మధ్యాహ్నాం భోజనానికి లేదా నైట్ డిన్నర్ కి బెస్ట్ ఆప్షన్. అన్ని వయస్సుల వారికి నచ్చుతుంది. సోయా రైస్ ప్రోటీన్ ల గొప్ప మూలం. కండరాలు, ఎముకలు, చర్మం ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది.
సోయా రైస్ లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడుతుంది. సోయా రైస్ తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది..తద్వారా డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. సోయా రైస్ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది,ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

ఇందులో విటమిన్ ఈ ఉంటుంది..ఇది చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సోయా రైస్ కాల్షియం, విటమిన్ డిని కలిగి ఉంటుంది, ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఆరోగ్యానికి ఇన్ని రకాలుగా మేలు చేసే సోయా రైస్ ని ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు. కావాలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
సోయా రైస్ తయారీకి కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం-1 కప్పు
సోయా చంక్స్- 1 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్- 1/2 టీస్పూన్
గరం మసాలా- 1/2 టీస్పూన్
పసుపు- 1/4 టీస్పూన్
కారం- 1/4 టీస్పూన్
ఉప్పు-తగినంత
ఉల్లిపాయ- 1
టమోటా- 1
బఠానీ- 1/2 కప్పు
క్యారెట్- 1/2 కప్పు
కొత్తిమీర-కొద్దిగా
నూనె- 2 టేబుల్ స్పూన్లు
Jowar kichidi : జొన్న ఖిచిడి..టేస్టీ అండ్ హెల్దీ..ఇలా చేశారంటే అమృతమే
సోయా రైస్ తయారీ విధానం
ముందుగా సోయా చంక్స్ ను వేడి నీటిలో 10 నిమిషాలు నానబెట్టండి.
తర్వాత వాటిని పిండి నీటిని తీసివేయండి.
ఇప్పుడు బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టండి.
ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి వేడయ్యాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి.
తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం వేయించాక ఇందులో టమోటా, బఠానీలు, క్యారెట్ వేసి 5 నిమిషాలు ఉడికించండి.
తర్వాత అందులో సోయా చంక్స్, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు వేసి కలపండి.
ఇప్పుడు అందులో నానబెట్టిన బియ్యం వేసి కలిపి 2 కప్పుల నీరు పోసి మూత పెట్టి మీడియం మంట మీద 15 నిమిషాలు ఉడికించండి.
బియ్యం ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడిగా వడ్డించుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications