Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
హీరో నానికి ఎంతో ఇష్టమైన ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్..చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు
నేచురల్ స్టార్ గా గుర్తింపు పొందిన టాలీవుడ్ హీరో నాని ఓ సందర్భంలో తనకు ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. పుల్ల పుల్లగా కారం కారంగా అక్కడడక్కడ ఆమ్లెట్ తగులుతూ కమ్మగా ఉండే ఈ ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ ను ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు.
ఒక్కసారి దీని టేస్ట్ చూశారంటే మళ్లీ మళ్లీ చేసుకొని లొట్టలేసుకొని తింటారు. అయితే ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయరీకి ఏమేం కావాలి..తయారీ పద్దతి గురించి ఇప్పుడు చూద్దాం.

ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ తయారీకి కావాల్సినవి
ఉడకించిన రైస్ లేదా మిగిలిపోయిన అన్నం- 2 కప్పులు
మామిడికాయ ఆవకాయ-తగినంత
ఆయిల్- 1 టేబుల్ స్పూన్
గుడ్లు- 2
ఉప్పు- తగినంత
పసుపు- 1/4 టీ స్పూన్
ధనియాల పొడి- 1/ 4 టీ స్పూన్
జీలకర్ర పొడి-చిటికెడు
వెల్లుల్లి- 3
పచ్చిమిర్చి(తరిగిన)- 2
కొత్తిమీర(సన్నగా తరిగిన)-కొంచెం
తయారీ విధానం
-ముందుగా ఒక బౌల్ లో రెండు కప్పుల ఉడికించిన అన్నం లేద మిగిలిపోయిన
అన్నం తీసుకోండి
-ఈ అన్నంలో సరిపడినంత మామాడికాయ ఆవకాయ వేసి కలపడండి. ఒకవేళ మీ దగ్గర
మామిడికాయ ఆవకాయ లేకుంటే మామాడికాయతో చేసిన ఏ పచ్చడి అయినా
వేసుకోవచ్చు.
-గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకండి. ఎందుకంటే రైస్ మెత్తగా అయిపోతే
టేస్ట్ బాగుండదు.
-రైస్ మొత్తం ఆవకాయ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఆ బౌల్ ని పక్కన
పెట్టండి
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అందులో
పోయండి.
-ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటను సిమ్ లో పెట్టి ఈ ఆయిల్ లో రెండు
గుడ్లు పగలకొట్టుకొని వేసుకోండి. కావాలనుకుంటే ఇంకో గుడ్డు కూడా
వేసుకోవచ్చు.
-ఇప్పుడు దానిపై చాలా కొద్దిగా ఉప్పు(ఆల్రెడీ ఆవకాయలో ఉంటది కాబట్టి
కొంచెం వేయాలి),పావు టీస్పూన్ పసుపు,పావు టీస్పూన్ ధనియాల
పొడి,చిటికెడు జీలకర్ర పొడి చల్లుకొని ఆమ్లెట్ ని ముక్కలుగా
విడదీసుకోండి.
-ఇప్పుడు దీంట్లో మూడు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని
వేసుకోండి. దీంట్లోనే రెండు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని
వేసుకోండి.
-ఒక నిమిషం వేగిన తర్వాత ముందుగా ఆవకాయతో కలిపి పెట్టుకున్న రైస్ ని
ఇందులో వేసేయాలి.
-రైస్ బాగా వేడెక్కేదాకా నిదానంగా ఫ్రై చేసుకోండి.
-ఒక్క ఐదు నిమిషాలు మంటను సిమ్ లో పెట్టి వేయించుకుంటే రైస్ బాగా
వేడెక్కి వెల్లుల్లి,పచ్చిమిర్చి ప్లేవర్ రైస్ కి బాగా పట్టి మంచి
రుచి వస్తుంది.
-ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దాని మీద సన్నగా తరిగిన
కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ ని
ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications