Latest Updates
-
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.!
High Protein Dosa: ప్రోటీన్ కావాలంటే ఇలాంటి దోశ తినాలి.. ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేసుకోవాలంటే?
దోశలు చాలా మందికి ఫెవరెట్. కొందరైతే ప్రతిరోజూ దోశలు తినమన్నా తింటారు. దోశలో ఉండే ఆ రుచి, ఆ క్రిస్పీనెస్‌కి చాలా మంది అభిమానులు అయిపోతుంటారు. అలానే దోశలో చాలా రకాల దోశలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి పుష్కలంగా పోషకాలు ఇచ్చే హై ప్రోటీన్ దోశ. దీనిని తినడం వల్ల రుచితో పాటు ప్రోటీన్ పుష్కలంగా దొరుకుతుంది. వివిధ చిరుధాన్యాలు కలిపి చేసే ఈ దోశను చేసుకోవడం కూడా చాలా సులభం. ఈ దోశను ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనే అన్ని విషయాల గురించి మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం రండి.
హై ప్రోటీన్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
- రెండు కప్పుల రేషన్ బియ్యం
- ఒక కప్పు రాగులు
- ఒక కప్పు జొన్నలు
- ఒక కప్పు మినపప్పు
- ఒక కప్పు పెసలు
- అర టీస్పూన్ మెంతులు
- ఒక టీస్పూన్ జీలకర్ర
- రుచికి సరిపడా ఉప్పు
- కొంచెం నూనె

హై ప్రోటీన్ దోశ తయారీ విధానం
ముందుగా బియ్యం, రాగులు, జొన్నలు, మినపప్పు, పెసలు, మెంతులను బాగా కడుక్కోవాలి. అందులోని మురికి అంతా పోయే విధంగా బాగా శుభ్రంగా ఒక నాలుగు సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం నీళ్లు పోసి సుమారు ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి. ఎనిమిది గంటల వరకు నానిన తరువాత బియ్యం, జొన్నలు, రాగులు, మినపప్పు, పెసలు, మెంతులను.. ఒక మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.
మెత్తగా రుబ్బుకున్న ఆ పిండిని ఓ గిన్నెలో తీసుకొని సుమారు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు పక్కన పులియనివ్వాలి. ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు పిండి పులిసిన తరువాత.. అందులో రుచికి తగినంత ఉప్పు, అలాగే జీలకర్ర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పిండిని అలా పక్కన పెట్టేయాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి.. దోశ పెనం వేసుకోవాలి. పెనం వేడయ్యాక దానిపై నూనె పూసుకోవాలి. ఇప్పుడు ఆ పెనం వేడయ్యాకా.. మనం దోశలు వేసుకోవాలి. దోశ కాలుతున్నప్పుడు దోశ అంచుల వెంట, అలాగే దోశ మధ్యలో కొంచెం నూనె పూసుకొని.. గోల్డెన్ కలర్‌లో వచ్చేంత వరకు కాల్చుకోవాలి. కొందరికి దోశను రెండు వైపులా కాల్చడం ఇష్టం ఉంటుంది. అలాంటి వ్యక్తులు దోశను తిప్పి రెండు వైపులా కాల్చుకోవచ్చు. ఇప్పుడు ఆ దోశలను ఓ ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన హై ప్రోటీన్ దోశ సిద్ధమైనట్లే.
ఈ దోశను కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్‌తో కూడా తినొచ్చు. ఇది అమోఘమైన రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ప్రతిరోజూ ప్రోటీన్ తినాలనుకునే వ్యక్తులు ఈ దోశను తినొచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
