Latest Updates
-
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.!
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.!
కాలీఫ్లవర్(గోబీ)తో కూరలు తప్ప కిచిడీ, మంచూరియా, ఫ్రైడ్ రైస్ ఇలా ఎక్కువగా చేస్తుంటాం. అయితే గోబీతో స్నాక్స్ చేసేటప్పుడు కొన్ని సాస్‌లు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఈ ప్రిజర్వేటివ్స్‌ను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం. కానీ ఎలాంటి సాస్‌లు లేకుండా స్ట్రీట్ ఫుడ్ రుచితో హైదరాబాద్ స్పెషల్ గోబీ 65ని చేసుకోవచ్చు. ఇలా చేసుకుని తింటే ఇక బయట కొనే అవసరం ఉండదు.

హైదరాబాద్ స్పెషల్ గోబీ 65 తయారీకి కావాల్సిన పదార్థాలు
-కాలీఫ్లవర్- 400 గ్రాములు
-కార్న్ ఫ్లోర్- పావు కప్పు
-మైదా పిండి- 2 టీస్పూన్లు
-ఉప్పు- తగినంత
-మిరియాల పొడి- చిటికెడు
-నీళ్లు- కప్పు
-పెరుగు- కప్పు
-ధనియాలపొడి- ఒక టీస్పూన్
-కారం పొడి- ఒక టీస్పూన్
-గరం మసాలా- అర టీస్పూన్
-అజినోమోటో పౌడర్- అర టీ స్పూన్
-రెడ్ ఫుడ్ కలర్- చిటికెడు
-నూనె- నాలుగు టీస్పూన్లు
-అల్లం వెల్లుల్లి- సన్నగా తరిగిన ముక్కలు- రెండు టీ స్పూన్లు
-ఉల్లిపాయ ముక్కలు- మూడు టీ స్పూన్లు
-పచ్చిమిర్చి- రెండు
-కరివేపాకు- ఒక రెబ్బ
-నిమ్మరసం- అర టీ స్పూన్
-కొత్తిమీర- కొద్దిగా
హైదరాబాద్ స్పెషల్ గోబీ 65 తయారీ విధానం
ముందుగా కాలీఫ్లవర్‌ను కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి 50 శాతం వరకు ఉడికించాలి. అవి చల్లారేవరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో కార్న్ ఫ్లోర్, మైదా పిండి, ఉప్పు, కారం, మిరియాల పొడి, నీళ్లు పోసి ఉండలు లేకుండా చిక్కటి పిండిలా కలుపుకోవాలి.
ఇప్పుడు పూర్తిగా చల్లారిన కాలీఫ్లవర్ ముక్కలను పిండిలో కలుపుకోవాలి. ఈ ముక్కలను మరుగుతున్న నూనెలో వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో పెరుగు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అజినోమోటో పౌడర్, పసుపు వేసి బాగా కలపాలి.
చివరగా పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి కలపాలి. తర్వాత కరివేపాకు వేసి మెత్తబడనివ్వాలి. ఇప్పుడు పెరుగు మిశ్రమం వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత వేయించిన కాలీ ఫ్లవర్ ముక్కలు వేసి పెద్ద మంట మీద కొన్ని సెకన్లపాటు వేయించాలి. చివరిగా నిమ్మరసం, కొత్తిమీర వేసి మరోసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే స్ట్రీట్ ఫుడ్ స్టైల్ గోబీ 65 రెడీ.
వీరికి అలర్ట్
గోబీ 65లో విటమిన్లు బీ, సీ, కే, ఫైబర్, మినరల్స్, కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఎముకల ఆరోగ్యానికి దోహదపడుతుంది. అయితే, డీప్ ఫ్రై చేయడం కారణంగా కొవ్వులు అధిక స్థాయిలో ఉండాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు, గుండె జబ్బులు ఉన్నవారు పరిమితంగా తీసుకోవాలి. లేదంటే 'ఎయిర్-ఫ్రై' చేయడం ద్వారా ఎక్కువ పోషకాలు, తక్కువ ఫ్యాట్‌ను పొందవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications