Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
ఇడ్లి పిండితో ఇడ్లీ ఢోక్లా.. మెత్తగా, స్పాంజీగా వుండే ఈ ఢోక్లాను ఒకసారి ట్రై చేయండి..!
ఢోక్లా రెసిపీ గుజరాత్ రాష్ట్రంలో చాలా పాపులర్ డిష్. ఇక్క మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు దీన్ని తింటున్నారు. నార్త్ ఇండియాలో దీన్ని టిఫిన్‌గా స్నాక్స్‌గా తీసుకుంటారు. మనం వీటిని టిఫిన్‌గా ఎప్పుడూ చేసుకోము. కానీ ఇవి సాఫ్ట్‌గా స్పాంజీగా చాలా బాగుంటాయ్. పిల్లలు ఆడుకుంటూ వీటిని తింటారు. అయితే ఇడ్లీ పిండితో కూడా ఢోక్లాను చేయవచ్చు. ఇడ్లీ పిండి, చెనగపిండి వుంటే చాలా సింపుల్‌గా టేస్టీగా ఈ ఢోక్లాను రెడీ చేసుకోవచ్చు. ఇడ్లీ ఢోక్లా రెసిపీని మీ ముందుకు తీసుకొని వస్తున్నాం.

ఇడ్లి పిండితో ఢోక్లా తయారు చేయడానికి ఈ కింది వంటసామాగ్రి అవసరం పడుతుంది. ఇంట్లోనే మీకు ఇవి అందుబాటులో వుంటాయ్.
1 కప్పు ఇడ్లి పిండి
1 కప్పు చెనగ పిండి
అర కప్పు పెరుగు
అల్లం, పచ్చిమిర్చి పేస్టు
ఉప్పు, తినే సోడా
1 టీస్పూన్ నిమ్మరసం
మంచి నూనె
1 టీస్పూన్ ఆవాలు,
కరివేపాకులు
కొత్తిమీరలు

ఇడ్లి పిండితో ఢోక్లాను ఈ కింది విధంగా చేసుకోవాలి.
1. ముందుగా 1 కప్పు ఇడ్లీ పిండి, 1 కప్పు చెనగ పిండిని, అర కప్పు పెరుగును తీసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు చెనగపిండిని తీసుకొని అందులో అర కప్పు పెరుగును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇడ్లీ పిండిలా అయ్యేంత వరకు కొన్ని నీళ్లను పోసుకొని కలుపుకోవాలి.
2. ఇందులోనే 1 కప్పు ఇడ్లీ పిండిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచం అల్లం, మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకున్న పేస్టును ఒక టీస్పూన్ అంత వేసి కలుపుకోవాలి. పావు టీస్పూన్ ఉప్పు వేసుకొని చిటికెడంత తినే సోడాను వేసుకోవాలి. ఇక టీస్పూన్ నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి.
3. ఢోక్లా చేసుకోవాలనుకుంటున్న బౌల్‌కి కొంచెం నూనెను రాసుకోవాలి. ధోక్లా కోసం తయారు చేసుకున్న దాన్ని బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని అందులో ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని ధోక్లా పిండి వేసుకున్న బౌల్‌ను స్టాండ్‌పైన పెట్టుకోవాలి. కుక్కర్‌కు మూత పెట్టుకొని 15 నిమిశాల వరకు ఉడికించాలి.
4. 15 నిమిశాల తరువాత చూస్తే ధోక్లా తయారవడం మనం చూడొచ్చు. ఇప్పుడు కుక్కర్‌ను స్టవ్ పై నుంచి కిందకు దించేసి. ఒక ప్యాన్‌లో 1 టేబల్ స్పూన్ మంచి నూనెను పోసి బాగా వేడి చేయాలి. ఇందులో ఒక టీస్పూన్ ఆవాలు, కొన్ని కరివేపాకులను వేసుకోవాలి. చిన్నగా తరిగిన కొత్తిమీరలను వేసుకొని స్టవ్‌ను ఆఫ్ చేసుకోవాలి.
5. ఇప్పుడు ధోక్లను ముక్కలుగా కట్ చేసుకొని దానిపై పోప్‌ను వేసుకోవాలి. దోక్లా మొత్తం ఎలా వుందో అలా బౌల్‌నుంచి బయటకు వచ్చేలా ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇక దీంతో మీ టేస్టీ ధోక్లా రెడీ అయినట్టే. ఉదయం పిల్లలు రెగులర్ టిఫిన్ బోర్ కొట్టినప్పుడు ఈ ధోక్లా చేస్తే చాలా ఇష్టంగా తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications