రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా..

Posted By:

మన ఇళల్లో రాత్రి పూట అన్నం ఎప్పుడైనా మిగితిపోయే ఉదయాన్నే దాన్ని పడేసేవాళ్లు కొందరయితే..తాలింపు పెట్టి పులిహోర, ఎగ్ రైస్, టమాటో రైస్ ఇలా చేసేవాళ్లు మరికొందరు. అయితే మీరెప్పుడైనా మిగిలిపోయిన అన్నంతో దోశ ట్రై చేశారా? చాలా బాగుంటుంది దీని రుచి.

మిగిలిపోయిన అన్నంతో దోశ ఎలా తయారుచేస్తారు అని ఆలోచిస్తున్నారా? చాలా ఈజీగానే దీనిని తయారుచేసుకోవచ్చు. ఒక్కసారి మీ ఇంట్లో ఈ దోశను చేశారంటే..పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ ఈ దోశ ఫేవరెట్ గా మారిపోతుంది. మిగిలిపోయిన అన్నంతో టేస్టీ దోశలు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

How to make instant crispy dosa with leftover rice recipe in telugu

మిగిలిపోయన అన్నంతో దోశ తయారీకి కావాల్సినవి

-గోధుమ పిండి
-పుల్లని పెరుగు
-బియ్యం పిండి
-మిగిలిన అన్నం
-వంటసోడా
-ఉప్పు
-నూనె

షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ!

మిగిలిపోయన అన్నంతో దోశ తయారీ విధానం

-ముందుగా మిక్సీ జార్ తీసుకోండి. అందులో రెండు కప్పుల అన్నం, 1 కప్పు బియ్యం పిండి, అర కప్పు గోధుమ పిండి, 1 కప్పు పుల్లని పెరుగు, కప్పుంబావు దాకా నీళ్లు పోసి మెత్తాన్ని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.

-గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ వంటసోడా, తగినన్ని నీళ్లు వేసి పల్చగా చేసుకోండి. సాధారణ దోశపిండిని ఎలా జారుగా కలుపుకుంటామో అలా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక పిండిపై మూతపెట్టి 15 నిమిషాలు వదిలేయండి.

-15 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోండి. పెనం మీద నాలుగు బొట్లు నూనె వేసి ఉల్లిపాయ లేదా వంకాయ లేదా ఆలుగడ్డతో పెనాన్ని బాగా రుద్దండి.

-పెనం బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే 1 పెద్ద గరిటెడు పిండి తీసుకుని మరీ పల్చగా కాకుండా కాస్త మందంగానే దోశలా పోయండి. పల్చగా పోస్తే ఈ పిండితో దోశ సరిగ్గా రాదు విరిగిపోతుంది.

-దోశను మందంగా స్ప్రెడ్ చేసుకున్నాక దాని అంచుల వెంట, మధ్యన కాస్త నూనె వేసి కాల్చండి. నిదానంగా మీడిమంట మీద కాల్చితేనే పిండి ఉడికి దోశ కరకరలాడుతూ ఉంటుంది. ఒకవైపు కాలిన తర్వాత తిప్పి దోశను మరోవైపు 1 నిమిషం కాల్చితే పర్ఫెక్ట్ గా క్రిస్పీ దోశ రెడీ అవుతుంది.

-ఈ దోశను పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీతో తింటుంటే కిర్రాక్ ఉంటుంది.

[ of 5 - Users]
Desktop Bottom Promotion