Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఇరానీ చాయ్ బయట కాదు.. ఇలా ఇంట్లోనే చేసుకొని తాగండి..!!
మన హైదరాబాద్‌లో ఇరానీ చాయ్ చాలా ఫేమస్ అన్న విషయం తెలిసిందే. ఈ ఇరానీ చాయ్ ఇరాన్ దేశం నుంచి పుట్టుకొని వచ్చింది. 19వ శతాబ్దంలో ఇరానీయులు భారతదేశానికి ఇరానీ చాయ్‌ను పరిచయం చేశారు. 20వ శతాబ్దంలో ఇరానీయులు భారీ సంఖ్యలో భారతదేశానికి వచ్చి ఇరానీ చాయ్ సెంటర్లను స్థాపించారు. ఇలా ఇరానీ కేఫ్‌లు మొదలయ్యాయ్. హైదరాబాద్‌లోనే కాదు, ముంబైలో కూడా ఇరానీ కేఫ్‌లు చాలా ఉన్నాయ్.

ఇరానీ చాయ్ కేవలం ఒక చాయ్ మాత్రమే కాదు. దీని వెనక ఒక పెద్ద సంస్కృతి, చరిత్ర ఉంది. వర్షాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ బయట కనీసం ఒక్కసారైనా ఇరానీ చాయ్ తాగకుండా ఉండరు. అలాంటి ఇరానీ చాయ్‌ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మీకు అందిస్తున్నాం. అయితే చాయ్ టేస్టీగా రావాలంటే చాయ్ పత్తీ కూడా బాగుండాలి. నాణ్యమైన చాయ్ పత్తీని మాత్రమే వాడండి. మరి ఇరానీ చాయ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
ఇరానీ చాయ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్ధాలు ఇవే :
పాలు: 2 కప్పులు
నీరు: 1 కప్పు
2 టీస్పూన్ల చాయ్ పత్తి
చక్కెర: 3 టీస్పూన్లు
యాలకులు: 3-4
కుంకుమ పువ్వు: కొన్ని తంతులు
పంచదార: రుచికి సరిపడా
ఇరానీ చాయ్ తయారు చేసే విధానం :
1. ముందుగా ఒక పెద్ద పాత్రలో 2 కప్పుల పాలు తీసుకొని, అందులో 1 కప్పు నీళ్లు పోసుకొని బాగా మరిగించుకోవాలి. పాలు కాగుతున్నప్పుడే అందులో 2 స్పూన్ల చాయ్ పత్తీని వేసి కలుపుకోవాలి.
2. పాలు వేడి చేస్తున్నప్పుడే అందులో యాలాకుల చూర్ణం, కుంకుమ పువ్వు, చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. చిన్న మంటను పెట్టి 15 నిమిశాల వరకు బాగా మరిగించాలి. చాయ్ మరిగిన తరువాత స్టవ్‌ను ఆఫ్ చేసి గిన్నెలో పోసుకోవాలి.
3. ఇక రెెడీ అయిన ఇరానీ చాయ్‌ని చిన్న గ్లాస్‌లో పోసుకొని తాగడమే. పాలను ఎంత ఎక్కువగా కాచితే చాయ్ అంత టేస్టీగా వస్తుంది. పాలను 15 నిమిశాలైనా బాగా మరిగించాలి. దీని వల్ల చాయ్ మరింత టేస్టీగా వస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications