Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
టేస్టీ రాజస్థానీ జిలేబీని చేసుకుందామా..? చాలా సింపుల్..!
కొన్ని స్వీట్ల పేర్లు తలచుకోగానే నోట్లో లాలాజలం ఊరుతుంది. అన్ని స్వీట్లలో జిలేబీ వేరయా అంటే కాదనే వారెవరు. సింపుల్‌గా ఉన్నా చాలా టేస్టీగా ఎక్కువగా తినాలనిపించే స్వీట్ జిలేబీ. బయట మార్కెట్లో రాజస్థానీ జిలేబీలను చూసే ఉంటాం. అప్పటికప్పుడనే పెధ్ద ఖడాయ్లో వేసి అమ్ముతుంటారు. అయితే బయట ఎలాంటి శుభ్రతా పాటించకుండా బయట తయారయ్యే స్వీట్స్ తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. కాబట్టి ఇంట్లోనే టేస్టీ జిలేబీని ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం.
జిలేబీ తయారు చేసే విధానం :
జిలేబీ తయారు చేయడానికి కావలసిన వంట సామాను
ఒక కప్పు మైద పిండి, రెండూ టీ స్పూన్ల ఆవు నెయ్యి, ఫుడ్ కలర్, ఐదు టీస్పూన్ల పెరుగు, రెండు కప్పుల నీళ్లు, జిలేబీలు వేయించడానికి తగినంత నూనె, బేకింగ్ సోడా, ఒక నిమ్మకాయ, రెండు కప్పుల చెక్కర
ఒక బౌల్లో ఒక కప్పు మైద పిండిని తీసుకోవాలి. ఇందులోనే
రెండు టీ స్పూన్ల ఆవు నెయ్యిని వేసుకోవాలి. రెండింటినీ బాగా
కలుపుకోవాలి. తరువాత అందులో చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ లేదా మీకు
నచ్చిన
ఫుడ్ కలర్‌ను వేసుకోవచ్చు. పిండిని నెయ్యిని, ఫుడ్ కలర్
మిక్స్ చేసుకుంటూ కలిపిన తరువాత 5 టీ స్పూన్ల పెరుగుతను వేసుకొని
కలపాలి. పలుచగా కాకుండా పిండిని చిక్కగా కలుపుకోవాలి. తగినన్ని నీళ్లు
పోసుకుంటూ చేతితో బాగా కలుపుకోవాలి. తరువాత ఈ బౌల్‌ను పక్కకు
పెట్ట. మరో ప్యాన్‌లో రెండు కప్పుల చెక్కరను తీసుకోవాలి.
దీంట్లో ఒక కప్పు నీరు వేసి పాకాన్ని తయారు చేసుకోవాలి. తగినంత
ఇలాయిచీ పొడిని వేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసాన్ని కూడా
వేసుకోవచ్చు.

ఇప్పుడు ముందుగా కలిపిన పిండిని తీసుకొని అందులో అరటీస్పూన్ వంట సోడా, అర టీస్పూన్ నిమ్మరసాన్ని వేసుకొని కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జిలేబీలు వేసే బాటిల్లో తీసుకోవాలి.
జిలీబేలు వేయించడానికి ఒక ప్యాన్‌ను తీసుకొని అందులో నూనె పోసుకోవాలి. జిలేబీలను నూనెలో వేసి బాగా వేంచాలి. జిలేబీలు మాడిపోకుండా లోఫ్లేమ్లోనే వాటిని వేంచాలి. జిలేబీలను వేంచిన తరువాత వాటిని అంతకు ముందు తయారు చేసి పెట్టుకున్నా చెక్కర పాకంలో వేయాలి. జిలేబీలు అన్నీ చెక్కర పాకంలో మునిగేలా వాటిని చెక్కర పాకంలో వేయాలి. పాకం, జిలేబీ రెండూ వేడియా ఉన్నప్పుడు ఇలా చేయాలి. ఇలా మిగిలిన మొత్తం పిండిని జిలేబీలే వేసి నూనెలో వేయించిన తరువాత చెక్కర పాకంలో వేయాలి. చక్కర పాకంలో ఒక నిమిషం జిలేబీలను పెట్టి తరువాత వాటిని బయటకు తీసు వుంచుకోవాలి. ఇక టేస్టీ స్వీటీ జిలేబీ రెడీ అయినట్టే.
జిలేబీ తయారు చేసే విధానం చెప్పిన సందర్భంగా మీకు ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నారు. జిలేబీని మొట్టమొదట ఇరాన్ దేశంలో తయారు చేసేవారు. ఇరాన్లో జిలేబీని జుల్బియా అని అనేవారు. కాలం మారుతున్న కొద్దీ జుల్బియా కాస్తా జిలేబీగా మారింది. అయితే 15వ శతాబ్దంలో జిలేబీ స్వీట్ భారత దేశ స్వీట్లల్లో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. ఎన్ని కొత్త రాకాల స్వీట్లు వచ్చినప్పటికీ జిలేబీ స్థానం ఇంకా అలాగే ఉంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
