Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
నార్త్ ఇండియన్ స్టైల్‌లో ఝల్ మురి.. చాలా స్పైసీ టేస్టీ కూడా..!
ఝల్ మురి నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ స్నాక్‌గా చెప్పుకోవచ్చు. ఝల్ అంటే స్పైసీ, ముర్ అంటే ముర్ మురాలు. స్పైసీ ముర్ మురాలుగా మనం ఝల్ మురి అని అంటాము. స్ట్రీట్ ఫుడ్‌లో చాలా మంది దీన్ని ఇష్టపడతారు. దీన్ని భేల్ పురిగా అందరూ భావిస్తారు కానీ భేల్ పురీకి ఝల్ మురి కి చాలా తేడా వుంది. ఒడిస్సా, బంగ్లాదేశ్‌లో ఈ ఝల్‌మురి చాలా పాపలర్ స్ట్రీట్ ఫుడ్.

ఝల్ మురి తయారు చేయడానికి ఎక్కువ వంట సామాగ్రి కూడా అవసరం లేదు. దీనికి ముఖ్యంగా కావాల్సిందే ముర్ మురాలు, ఆలుగడ్డ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, ఊరగాయ పచ్చడి నూనె, పూదీన ఆకులు, ఉప్పు, కారంపొడి, సేవ్, నిమ్మరసం, జిలుకర పొడి ఇంకా కొన్ని పదార్ధాలు మాత్రమే కావాలి. ఝల్ మురి తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. కేవలం 15 నిమిశాల్లో ఝల్ మురీని రెడీ చేసుకోవచ్చు.
ఝల్ మురి తయారు చేసుకోవడానికి కావాల్సిన వంట సామాగ్రిని కింది విధంగా రెడీ చేసుకోవాలి.
1. 2.1/2 కప్పుల ముర్‌మురాలు
2. 1 పెద్దసైజు ఉడకబెట్టిన ఆలుగడ్డ
3. 1 చిన్ని ఉల్లిపాయ
4. 1 మీడియం సైజు టమాట
5. 1/4 కప్పు ఖీరదోసకాయ ముక్కలు
6. 3 పచ్చిమిరపకాయలు
7. 3టేబుల్ స్పూన్ల పూదీన ఆకులు
8. 1/4 టీస్పూన్ ఉప్పు
9. 1/2 టీస్పూన్ మర్చీ పౌడర్
10. 1 టీస్పూన్ జిలకర పొడి
11. 3/4 టీస్పూన్ ఛాట్ మసాలా
12. 1/4 కప్పు సేవ్
13. నిమ్మసరం
14. 1 టేబుల్ స్పూన్ ఆవాలు నూనె

ఝల్ మరిని ఈ కింది విధంగా తయారు చేసుకోవాలి.
1. ముందుగా ఒక మీడియం సైజు టమాట, 1 చిన్న ఉల్లిపాయను, 1/4 కప్పు ఖీరదోసకాయ ముక్కలను కోసుకొని బౌల్‌లో పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి.
2. ఉడికిన ఆలుగడ్డను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ చిన్న ముక్కలను ఒక బౌల్‌లో వేసుకొని మొత్తం ముద్ద కాకుండా ఉడికించాలి.
3. ఇప్పుడు కారంపొడిని, రుచిక సరిపడ ఉప్పును, ముర్ మురాల మసాలాను వేసుకోవాలి. మురి మసాలా లేకపోతే జిలుకర పొడిని వేసుకోవాలి. దీనికి బదులుగా ఛాట్ మసాలాను కూడా వేసుకోవచ్చు.
4.అరచెక్క నిమ్మకాయ రసాన్ని కూడా బౌల్‌లో పిండుకోవాలి.
5. ఒక టీస్పూన్ ఆవాల నూనెను వేసుకోవాలి. ఆవాల నూనెకు బదులుగా ఏదైనా పచ్చడలోని నూనెను తీసుకోవచ్చు. దీని వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది.
6. పూదీన ఆకులను చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పూదీన ఆకులు మరీ పచ్చిగా వుండకుండా జాగ్రత్త పడాలి.
7. ఇప్పుడు బౌల్‌లో వున్న మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే ఇతర రుచికరమైన మసాలాను కూడా వేసుకోవచ్చు. ఫ్రై చేసిన పల్లీలను కూడా వేసుకోవాలి.
8. ఇందులో రెండున్నర కప్పుల ముర్‌మురాలను యాడ్ చేసుకోవాలి. ముర్ మురాలను వేసే ముందు వీటిని కడాయ్‌లో కొంచం ఫ్రై చేసుకోవచ్చు.
9. రుచికి ఉప్పు సరిపోయిందా లేదు చెక్ చేసుకుంటూ కావాలంటే కొంత నిమ్మకాయ పిండుకుంటూ మొత్తాన్ని బౌల్‌లో బాగా కలుపుకోవాలి. పావు కప్పు సేవ్‌ను బౌల్‌లో యాడ్ చేసుకొని కలుపుకోవాలి.
10. ఇక దీంతో మీ ఝాల్ మురి రెడీ అయినట్టే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications