Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
జొన్నపిండితో చేసిన ఈ జొన్న పరాటా.. రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచింది..!
జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటిస్ పేషంట్ల, ఎలాంటి అనారోగ్య సమస్యలు వున్నవారైనా రోజుకు ఒకటి రెండు జొన్న రొట్టెలు తొంటే శరీరానికి కావాల్సిన శక్లి వస్తుంది. రోజూ జొన్న రొట్టెతింటే రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. ఇప్పుడు అలాంటి జొన్న పరాటానే రెసిపీగా మీముందుకు తీసుకొని వచ్చాము. జొన్న రొట్టె అనగానే చాలా మందికి బోర్ కొడుతుంది. కానీ ఈ జొన్న పరాటా చాలా టేస్టీగా వుంటుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. జొన్న పరాటాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

జొన్న పరాటాను తయారు చేసుకోవడానికి కావాల్సిన వంటసామాగ్రిని సిద్ధం చేసుకోండి.
1 కప్పు జొన్నపిండి
ఒక పావు కప్పు గోదుమ పిండి
ఒక కప్పు కట్ చేసిన మెంతి ఆకులు
రుచికి సరిపడ ఉప్పు
ఒక టీ స్పూన్ ధనియాల పొడి
అర టీస్పూన్ కారంపొడి
అర టీస్పూన్ పచ్చిమిర్చి పేస్టు
అరటీస్పూన్ వెల్లుల్లి పేస్టు
అర టీస్పూన్ జిలుకర పొడి
పావు టీస్పూన్ పసుపు
మూడు టీస్పూన్ల నువ్వులు
జొన్న పరాటాను ఈ కింది విధంగా తయారు చేసుకోవాలి :
1. ముందుగా మిక్సింగ్ బౌల్‌లోకి 1 కప్పు జొన్నపిండిని తీసుకోవాలి. జొన్నపిండిని జెల్లడలోకి తీసుకొని జెల్లడపట్టాలి. పరాటాలు బాగా కావడానికి ఒక పావు కప్పు గోదుమ పిండిని అందులో కలుపుకోవాలి. ఈ పిండిని బాగా జెల్లడ పట్టాలి.
2. పిండిలో ఒక కప్పు కట్ చేసిన మెంతి ఆకులను లేదంటే పాలకూర ఆకులను తీసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పును, ఒక టీ స్పూన్ ధనియాల పొడిని, అర టీస్పూన్ కారంపొడిని, అర టీస్పూన్ పచ్చిమిర్చి పేస్టును తీసుకోవాలి. ఇందులోనే అరటీస్పూన్ వెల్లుల్లి పేస్టును, అర టీస్పూన్ జిలుకర పొడిని, పావు టీస్పూన్ పసుపును, మూడు టీస్పూన్ల నువ్వులను తీసుకోవాలి. నువ్వులతో పరాటా మరింత టేస్టుగా మారుతుంది.
3. బౌల్‌లో పిండిని మొత్తం బాగా కలపాలి. ఇందులో ముప్పావు కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. 2 టీస్పూన్ల మంచి నూనెను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. పిండిని సెమీ సాఫ్ట్‌గా మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా అవుతే కొన్ని నీళ్లను పోసుకోవచ్చు.
4. కొంచెం పిండి ముద్దను తీసుకొని చేతిలోనే రౌండ్‌గా చేసుకోవాలి. తరువాత పొడి జొన్నపిండిలో డిప్ చేసి చపాతీలా రోల్ చేసుకోవాలి. మరీ మందంగా, మరీ సన్నగా కాకుండా పరాటాలు ఎలాగైతే చేస్తామో అలాగే రోల్ చేసుకోవాలి. ఇప్పుడు పెనం మీద వేసేముందు పరాటాపై కొన్ని నువ్వులను చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల పరాటా చూడ్డానికి చాలా బాగుండడమే కాకుండా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
5. పెనంపెట్టి, మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి పరాటాను రెండు పక్కలా కాల్చాలి. రెండు పక్కల నెయ్యిని వేసుకొని జాగ్రత్తగా మంటను అడ్జస్ట్ చేసుకుంటూ పరాటాను కాల్చుకోవాలి. మిగిలిన మొత్తం పిండిని కూడా ఇలా చేసుకోవాలి.
6. ఇక దీంతో జొన్న పరాటా రెడీ అయినట్టే. పెరుగుతో ఈ పరాటాను సర్వ చేసుకోవచ్చు. రుచి మాత్రమే కాదు ఆరోగ్యనికి కూడా ఇది చాలా మంచిది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications