Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
kaju chikki: రుచికి రుచి,ఆరోగ్యానికి ఆరోగ్యం..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..
రుచికి రుచి,ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఫుడ్ కాజు చిక్కి. దీనిని కాజు పట్టి అని కూడా అంటారు. టేస్ట్ యమా రుచిగా ఉంటుంది. చాలామంది దీనిని తయారుచేయడం చాలా కష్టమేమో అని భావించి స్వీట్ షాపులలో కొనుక్కుంటారు. వాస్తవానికి దీనిని ఇంట్లోనే చాలా చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని టిప్ప్ పాటించి చేస్తే స్వీట్ షాపులో లభించే కాజు చిక్కి కన్నా ఎక్కువ టేస్టీగా చేయవచ్చు. స్వీట్ షాపు స్టైల్ ని మంచిన టేస్ట్ తో కాజు చిక్కిని కేవలం 10 నిమిసాల్లోనే ఇంట్లో ఎలా చేసుకోవాలి,దీని తయారీకి కావాల్సిన పదార్థాలేంటో ఇక్కడ చూడండి.
కాజు చిక్కి తయారీకి కావాల్సిన పదార్థాలు
బెల్లం-అర కప్పు
జీడిపప్పు-1 కప్పు
యాలకల పొడి-పావు టీ స్పూన్
నెయ్యి- 1 టీస్పూన్
నూనె
నీళ్లు

కాజు చిక్కి తయారీ విధానం
-ముందుగా ఒక ప్లేట్ లో కొంచెం నెయ్యి వేసి ప్లేట్ మొత్తం అది అప్లై చేసి పక్కనపెట్టుకోండి
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ పోసి అది వేడెక్కిన తర్వాత అందులో 1 కప్పు జీడిపప్పు వేసి లైట్ గా వేయించి వాటిని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టి అందులో బెల్లం,కొంచెం నీళ్లు పోసి బెల్లం పూర్తిగా కరగనివ్వాలి. అరిసెల పాకం కంటే కొంచెం గట్టిగా వచ్చేదాకా ఉడికించుకోండి.
-పాకంలోనే నెయ్యి, యాలకల పొడి వేసి కలుపుకున్న తర్వాత అందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆపేసేయండి.
-వెంటనే ఆలస్యం చేయకుండా దీనిని ముందుగా నెయ్యి అప్లై చేసిన ఫ్లేట్ లో వేసి సర్దుకోండి. స్క్వేయర్ షేపులో దానిని చేసుకొని కాసేపు చల్లారనివ్వండి.
-కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దానిని చాకుతో మీకు నచ్చిన షేపులో కట్ చేసుకోండి. చల్లారిన తర్వాత దానిని చాకుతో చిన్నగా తీస్తే వచ్చేస్తుంది. అంతే కాజు చిక్కి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications