Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కర్నాటక స్టైల్లో గిర్మిట్‌ను ఇలా చేసుకొని చాయ్‌తో తింటే..ఆహా..!!
మురుమురాలతో చేసే గిర్మిట్ కర్నాటకలో చాలా స్పెషల్ స్నాక్. టైంపాస్ గా తినడానికి ఇది చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేసే విధానం కూడా చాలా సింపుల్‌గా ఫాస్ట్‌గా ఉంటుంది. ఉత్తర కర్నాటక ప్రాంతంలో దీనిని ఎక్కువగా తయారు చేస్తారు. ఇది తయారు చేయడానికి కూడా ఎక్కువ వంట పదార్ధాలు అవసరం లేదు. మరి ఈ గిర్మిట్‌ను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.

గిర్మిట్ తయారు చేయడానికి ఈ కింది పదార్ధాలు చాలా అవసరం :
మురమురలు - 3 కప్పులు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1/2 టీస్పూన్
హింగు - చిటికెడు
పచ్చిమిర్చి - 2
ఉల్లిపాయ - 1
టమోటా - 1
పసుపు - చిటికెడు
కారం - 1/2 టీస్పూన్
పుట్నాల పొడి - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - తగినంత
కొత్తిమీర - కొన్ని కత్తిరించినవి
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
గిర్మిట్‌ను ఈ కింది విధంగా రెడీ చేసుకోవాలి :
1. ముందుగా మురమురలను ఒక పెద్ద గిన్నెలో ఉంచి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేడిచేసి, అందులో ఆవాలు, ఇంగువ, పచ్చిమిర్చి వేయించి, పసుపు కారం వేసి బాగా కలపాలి.తాలింపులో ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత టమోటా ముక్కలు వేసి కొంచెం ఫ్రై అయ్యేవరకూ వేపుకోవాలి.
2. ఇందులోనే పుట్నాల పొడిని రుచికి సరిపడ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పక్కకు తీసిపెట్టుకున్న ముర్‌మురాలను పోప్‌లో వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం మిశ్రమం బాాగా కలిసే విధంగా జాగ్రత్త పడాలి. నిమ్మరసాన్ని పిండుకొని, కొన్ని కొత్తిమీర ఆకులను వేసుకోవడం వల్ల మరించి రుచిగా అవుతుంది.
చిట్కాలు:
పుట్నాల పొడి ఎంత బాగా ఉంటే గిర్మిట్ అంత బాగా రుచిగా వస్తుంది. ఈ పుట్నాల పొడిని మీరే స్వంతంగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే మార్కెట్లో మంచి బ్రాండ్‌కు చెందిన పుట్నాల పొడిని కొనుక్కోవాలి. గిర్మిట్‌ను చేసుకున్న తరువాత వేడి వేడిగా తినకుండా కొంచెం చల్లారిన తరువాత తినాలి. అలా తింటేనే గిర్మిట్ మరింత రుచిగా ఉంటుంది.
గిర్మిట్‌లో పల్లీలు, సేవ్‌ను కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సాయంత్రం ఛాయ్ తాగే సమయంలో చాయ్‌తో పాటు గిర్మిట్‌ను తింటూ ఉంటే ఆ రుచి, ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇదే కర్నాటక స్పెషల్ స్నాక్ గిర్మిట్ స్పెషాలిటీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications