Latest Updates
-
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా..
Katte pongali: కట్టె పొంగలి..తింటే స్వర్గమే..చేయడం చాలా సింపుల్
కట్టె పొంగలిని(katte pongali) ఎక్కువగా నైవేధ్యం కోసం తయారుచేస్తుంటారు. ఆలయాల్లో ప్రసాదంగా ఇచ్చే ఈ పొంగలి మంచి వాసన, రుచిని కలిగి ఉంటుంది. అయితే మనం టిఫిన్ లోకి ఏం చేయాలో తోచనప్పుడు సింపుల్ గా ఈ కట్టె పొంగలిని చేసుకుని తింటే అదిరిపోతుంది. ఎంతో రుచికరమైన కట్టె పొంగలిని సింపుల్ గా ఎలా చేసుకోవాలి,దీని తయారీకి ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం.
కట్టె పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-ఉప్పు
-నీళ్లు
-పెరపప్పు
-ఇంగువ
-నెయ్యి లేదా ఆయిల్
-జీలకర్ర
-పచ్చి శెనగపప్పు
-కరివేపాకు
-మిరియాలు
-అల్లం
-పచ్చి మిర్చి
-జీడిపప్పు
-ఆవాలు

కట్టె పొంగలి తయారీ విధానం
-ముందుగా ఒక బౌల్ లో ఓ కప్పు అంటే 100 గ్రాముల దోశల బియ్యం(కంట్రోల్ బియ్యం)పోయండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ముప్పావు కప్పు పెసరపప్పు వేసి లో ప్లేమ్ మీద 2-3 నిమిషాలు మంచి సువాసన వచ్చేంతవరకు వేపుకోండి.
-ఇప్పుడు స్టవ్ ఆపేసి వేయించిన పెసరప్పుని ముందుగా బౌల్ లో ఉంచిన బియ్యంలో వేసి కలపండి.
-రెండు మూడు సార్లు నీళ్లు పోసి బాగా కడగండి.
-బాగా కడిగిన తర్వాత అందులో కొంచెం నీళ్లు పోసి 30 నిమిషాలు నానబెట్టండి.
-తర్వాత స్టవ్ ఆన్ చేసి కట్టె పొంగలి ఉడకడానికి సరిపడా గిన్నెను దానిమీద పెట్టి అందులో బియ్యం కొలిచిన కప్పుతోనే 6-7 కప్పుల నీళ్లు పోయండి.
-ఈ నీళ్లలో రుచికి ఉప్పు,పావు టీ స్పూన్ మిరియాలు వేసి నీళ్లను బాగా వేడి చేయండి.
-నీళ్లు వేడవుతున్నప్పుడు అందులో అరగంట సేపు నానబెట్టిన బియ్యం,పెసరప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలపి మంటను మీడియం ప్లేమ్ మీదపెట్టి ఉడికించండి.
-మధ్యమధ్యలో కలుపుతూ ఉండండి.మూతను పూర్తిగా పెట్టకుంగా కొంచెం తెరిచిపెట్టి ఉంచి ఉడికించండి.
-ఉడకడం దగ్గరపడ్డాక మంటని సిమ్ లో పెట్టుకోండి. మూత తీసి అనాన్ని స్పూన్ లేదా పప్పు గుత్తితో మెదిపినట్లు అంటే మాష్ చేసినట్లు చేయండి.
-అన్నం కాస్త మెదిపినట్లుగా ఉన్న తర్వాత అందులో కొంచెం వేడి చేసిన ఓ కప్పు వాటర్ పోసి కలిపి మరో 2 నిమిషాలు ఉడికించండి. కట్టె పొంగలి గట్టిగా తినాలనుకుంటే నీళ్లు పోయక్కర్లేదు..జ్యూసీగా తినాలనుకుంటే మాత్రం నీళ్లు పోసుకోండి.
-ఇప్పుడు మరో కడాయి పొయ్యి మీద పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి పోసి వేడి చేయండి.
-నెయ్యి వేడెక్కాక అందులో 1 టీస్పూన్ పచ్చి శెనగపప్పు,అర టీ స్పూన్ జీలకర్ర,అర టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి.
-కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు,3 పచ్చిమిర్చి చీలికలు,కొంచెం జీడిపప్పు,కచ్చాపచ్చాగా దంచిన అర టీ స్పూన్ మిరియాలు వేసి ఎర్రగా వచ్చేదాకా వేపుకోండి.
-కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే పావు టీ స్పూన్ ఇంగువ,రెండు రెబ్బల కరివేపాకు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేపుకోండి.
-ఇప్పుడు ఆ మిశ్రమాన్ని సిమ్ లో ఉడికించుకుంటున్న పొంగలిలో వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి 2 నిమిషాల పాటు ఆ కడాయిని మూతపెట్టి పక్కన పెట్టండి.
-2నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలపండి. కమ్మని కట్టె పొంగలి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications