Latest Updates
-
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా!
కేరళ స్పెషల్ వంకాయ పెరుగు పచ్చడి.. ఇలా చేసుకొని తింటే ముద్ద కూడా మిగలదు!
మన దేశంలో వంటలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఎవరూ వాటిని ఊహించని విధంగా ఉంటాయి. కొందరికి పేరు అంటే అసలు ఇష్టం ఉండదు. మరికొందరికి వంకాయ అంటే ఇష్టం ఉండదు. వాటిని చూస్తేనే ప్లేట్ తిప్పేస్తారు. అలాంటి వ్యక్తులు కూడా ఎంతో ఇష్టంగా పెరుగు వంకాయ చట్నీ చేస్తే.. కంచంలో మెతుకు లేకుండా ప్లేట్ మొత్తం నాకేస్తారు. కేరళలో దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ కేరళ స్పెషల్ పెరుగు వంకాయ చట్నీ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అవసరమైన పదార్థాలు:
- 3 నుంచి 5 చిన్న వంకాయలు
- కావాల్సినంత నూనె
- పావు టీస్పూన్ జీలకర్ర పొడి
- ఒక కప్పు పెరుగు
- రుచికి సరిపడా ఉప్పు
- అర టీస్పూన్ పసుపు
- ఎనిమిది లేదా పది పచ్చిమిర్చి
- ఒక ఉల్లిపాయ
- చిన్న అల్లం ముక్క
- చిన్న టమాటో
కేరళ స్పెషల్ పెరుగు వంకాయ పచ్చడి తయారీ విధానం
ముందుగా వంకాయను వేడి నీళ్లలో వేసుకొని అందులో పసుపు, ఉప్పు కలిపి రెండు నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత వాటిని గుండ్రని ఆకారంలో సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా తీసుకున్న పెరుగును బాగా చిలికి పలుచగా అయ్యేలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలాగే పావు టీస్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక అర టీస్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే వంకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని, వంకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు మరిగించుకోవాలి.
వంకాయ ముక్కలు మరిగేలోపు మిక్సీలో ఒక ఉల్లిపాయ, అర టీస్పూన్ జీలకర్ర, ఒక అల్లం ముక్క వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు పూర్తిగా మెత్తగా మగ్గిపోయిన వంకాయలను ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు వేగాక అందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలాను వేసుకోవాలి.
అలాగే అందులో ఒక చిన్న టమోటాను మొక్కలుగా చేసుకొని వేసుకోవాలి. మరీ పుల్లగా తినని వారు అయితే టొమాటోలను స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు టమాటో, ఉల్లిపాయలు అనీ అన్నీ మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. అవి మగ్గేలోపు.. ముందుగా వేయించిపెట్టుకున్న వంకాయ ముక్కలను మిస్కిలో వేసుకొని రుబ్బుకోవాలి. ఆ వంకాయ మిశ్రమాన్ని మొత్తాన్ని ముందుగా చిలికి పెట్టుకున్న పెరుగులో వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు పెరుగు, వంకాయ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఆ తరువాత ఆ పెరుగు మిశ్రమాన్ని తాలింపులోకి వేసుకొని ఒక నిమిషం పాటు సన్నటి మంట మీద ఉడకనివ్వాలి. ఆ తరువాత దానిపై సన్నగా తురుముకున్న కొత్తిమీరను చల్లుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ పెరుగు పచ్చడి సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications