Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కొల్హాపురి ఎగ్ కర్రీ.. చపాతీతో తింటే జీవితంలో మర్చిపోలేని టేస్ట్,ఎలా చేసుకోవాలో తెలుసా?
గుడ్డుతో మన దేశంలో ఎన్నో రకాల వంటకాలు చేస్తుంటారు. ఆమ్లెట్, గుడ్డు పులుసు, ఎగ్ బుర్జీ ఇలా ఎన్నో రకాల వంటలు ఉంటాయి. వాటిలో అత్యంత రుచికరమైనది, అలాగే అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో కొల్హాపురి ఎగ్ కర్రీ కూడా ఒకటి. మహారాష్ట్రలోని కొల్హాపుర్ ప్రాంతంలో దీనిని తయారు చేస్తారు. సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడే ఒక రుచికరమైన కూరను చపాతీతో లేదా అన్నంతో కలిపి తింటే రుచి మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. కానీ దీనిని ఎలా చేసుకోవాలో మీకు అర్ధం కావడం లేదు కదా? అందుకే ఈ స్టోరీని పూర్తిగా చదివి ఈ కొల్హాపురి స్టైల్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి.

కొల్హాపురి ఎగ్ కర్రీ చేయడానికి కావలసిన పదార్థాలు:
6 గుడ్లు
2 ఉల్లిపాయలు
1 టమోటా
1 అల్లం వెల్లుల్లి పేస్ట్
1 టీస్పూన్ గరం మసాలా
1 టీస్పూన్ ధనియాల పొడి
1/2 టీస్పూన్ పసుపు
1/2 టీస్పూన్ కారం పొడి
1/4 టీస్పూన్ జీలకర్ర పొడి
1/4 టీస్పూన్ ఆవాలు
1/4 టీస్పూన్ మెంతులు
2 టేబుల్ స్పూన్లు నూనె
రుచికి తగినంత ఉప్పు
కొత్తిమీర తరుగు (గార్నిష్ కోసం)
కొల్హాపురి ఎగ్ కర్రీ తయారీ విధానం:
ముందుగా గుడ్లను ఉడకబెట్టి, వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు
ఉల్లిపాయలు, టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తరువాత ఒక
పాన్ తీసుకోవాలి. అందులో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. అందులో
ఆవాలు, జీలకర్ర మరియు మెంతులు వేసి వేయించాలి.
.
తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. దాని
తదనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
అలాగే టమోటా ముక్కలు వేసుకొని అవి మెత్తగా అయ్యేవరకు వేయించాలి.
తరువాత అందులోనే గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, కారం పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. కొద్దిగా నీరు పోసి మసాలాను కొన్ని నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తరువాత ఆ మిశ్రమంలో ఉడికించిన గుడ్లను సగానికి కట్ చేసి కూరలో వేయాలి. ఓసారి రుచి చూసుకొని, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కూరను మరో రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చివరలో కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొల్హాపురి ఎగ్ కర్రీ సిద్ధమైనట్లే. దీనిని చపాతీతో పాటు అన్నంలో కలుపుకొని తింటే అదిరిపోతుంది అంతే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications