Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
Liquor Tea: బెంగాలీ స్పెషల్ 'లిక్కర్ ఛాయ్'..పొద్దుపొద్దున్నే ఫుల్లు కిక్కు,ఎలా చేసుకోవాలంటే..
బెంగాళీ ప్రజలు పొద్దుపొద్దునే లిక్కర్ ఛాయ్ తాగుతుంటారు. కొంతమంది దీనిని బ్లాక్ టీ అని కూడా పిలుస్తారు. ఈ టీ ఆరోగ్యానికి కూడా చాలామేలు చేస్తుందని చెబుతారు. పొద్దున్నే అరకప్పు ఈ టీ తాగితే మత్తు వదిలిపోతుందని.. రీప్రెష్ అయిపోతారని బెంగాళీలు అంటుంటారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ ఛాయ్ తాగుతుంటే ఆ మజా మాటల్లో వర్ణించలేని టేస్ట్ ఉంటుందంటారు. మరీ బెంగాళీలు అమితంగా ఇష్టపడే లిక్కర్ ఛాయ్ ని మీరు కూడా మీ ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
లిక్కర్ టీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-1 ఇంచు అల్లం
-పావు టీ స్పూన్ మిరియాలు
-3 టేబుల్ స్పూన్ల చక్కెర
-1 టీస్పూన్ టీ పౌడర్
-2 బిర్యానీ ఆకులు

లిక్కర్ టీ తయారీ విధానం
-లిక్కర్ టీ కోసం 300 గ్రాముల నీళ్లు బాగా మరిగించి అందులో పంచదార వేసి నీళ్లను తెర్లకాగనివ్వాలి.
-పంచదార కరిగి నీళ్లు తెర్లుతున్నప్పుడు అందులో బిర్యానీ ఆకులు, కచ్చాపచ్చాగా దంచిన అల్లం, కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు వేసి హై ప్లేమ్ మీద పొంగనివ్వాలి.
-నీళ్లు రంగు మారిన తర్వాత అందులో టీ పౌడర్ వేసి హై ప్లేమ్ మీద ఒక నిమిషం మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయండి.
-ఈ టీనిని వడకట్టుకొని గ్లాస్ లో పోసుకుంటే తాగడానికి టేస్టీ లిక్కర్ టీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
