Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Puchka Recipe: కోల్ కతా స్టైల్ 'పుచ్కా'..అమృతం రుచి,ఇలా చేసుకోండి
కోల్ కతాలో పుచ్కా వాటర్ తో చేసే పానీపూరీని ఎగబడి తింటారు. పుచ్చా వాటర్, పొటాటో మసాలాతో కలిపి పానీపూరీ తింటుంటే ఎన్ని తిన్నారన్న లెక్క కూడా ఉండదు. లాంగించేస్తూనే ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. అయితే కోల్ కతా స్టైల్ పుచ్కా రెసిపినీ ఇంట్లో చేసుకోవడం చాలా చాలా ఈజీ. ఇంట్లోనే ఈజీగా పుచ్కా రెసిపిని ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
పుచ్కా రెసిపి తయారీకి కావాల్సిన పదార్థాలు
-చింతపండు
-పచ్చిమిర్చి
-ఐస్ క్యూబ్స్
-కొత్తిమీర
-బ్లాక్ సాల్ట్
-నిమ్మకాయ
-పుదీనా
-ధనియాలు
-జీలకర్ర
-బంగాళదుంప
-ఎండు మిర్చి
-కారం
-పచ్చి బఠాణీ

పుచ్కా రెసిపి తయారీ విధానం
-ముందుగా చింతపండు నానబెట్టండి
-కుక్కర్ లో 5 బంగాళ దుంపలు,1 కప్పు నాన పచ్చి బఠాణీ,1 కప్పు నానబెట్టిన నల్ల శెనగలు,సరిపడా ఉప్పు వేసి 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు,2 ఎండుమిర్చి వేసి మంచి వాసన వచ్చేదాకా వేయించి తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత మిక్సీలో 1 కట్ట కొత్తిమీర,కొంచెం పుదీనా,కొంచెం నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు పుచ్కా వాటర్ రెడీ చేసుకోవాలి. ఇందుకోసం ఒక గిన్నె తీసుకొని అందులో..నానబెట్టిన చింతపండు రసం 1 కప్పు,కొత్తీమర పుదీనా మిశ్రమం, ముందుగా మిక్సీలో పట్టించి ఉంచిన జీలకర్ర ధనియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్, రుచికి తగినంత బ్లాక్ సాల్ట్, ఐస్ క్యూబ్స్, నీళ్లు పోసి బాగా కలపండి. తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, నిమ్మకాయ పరసం పిండి అన్నీ బాగా కలిసేటట్లు బాగా కలపండి. పుచ్కా వాటర్ రెడీ.
-ఇప్పుడు పొటాటో మసాలా రెడీ చేసుకోవాలి. ఇందుకోసం ఒక గిన్నెలో ఉడకించిన బంగాళదుంపల పొట్టు తీసేసి వాటిని, ఉడకబెట్టిన శెనగలు,బఠానీ మొత్తం ఒక బౌల్ లో వేసి రుచికి సరిపడా ఉప్పు, బ్లాక్ సాల్ట్,కారం, ముందు మిక్సీలో పట్టించుకున్న పుచ్కా మసాలా కొంచెం, గ్రీన్ చిల్లి పేస్ట్, చింతపండు రసం, చాట్ మసాలా 1 టీస్పూన్,చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి మొత్తాన్ని మెత్తగా పిసకాలి. పొటాటో మసాలా రెడీ.
-ఇప్పుడు పానీ పూరీ మధ్యలో బొక్క పెట్టి అందులో కొంచెం పొటాటో మసాలా పెట్టి దానిని పుచ్చా వాటర్ లో ముంచి తినడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications