Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వీకెండ్ స్పెషల్ గా ఇంట్లో ఇది చేస్తే..ఎగబడి తింటారు..ఎలా చేసుకోవాలంటే..
వడలు అంటే ఇష్టం లేని తెలుగువాళ్లు ఎవరుంటారు చెప్పండి. అయితే ఏదో గ్యాస్ట్రిక్ సమస్యలతో కొందరు వడలకు దూరంగా ఉంటారు కానీ వడలపై ఇష్టం మాత్రం తగ్గదు. అయితే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే కొత్తిమీర వడ ఎప్పుడైనా తిన్నారా? ఇది రుచికరమైన, ఆరోగ్యకరమైన చిరుతిండి.
కొత్తిమీరలో విటమిన్లు A, C, K, ఇనుము, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. కొత్తిమీర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అలాంటి కొత్తిమీరతో వడలు ఎలా చేయాలి,దీని తయారీకి ఏమేం పదార్థాలు కావాలో ఇక్కడ చూడండి.

కొత్తిమీర వడ తయారీకి కావలసిన పదార్థాలు
-కొత్తిమీర - 1 కట్ట
-శనగపిండి - 1 కప్పు
-బియ్యప్పిండి - 1/2 కప్పు
-ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగిన)
-జీలకర్ర - 1/2 టీస్పూన్
-ధనియాల పొడి - 1/2 టీస్పూన్
-గరం మసాలా - 1/4 టీస్పూన్
-పచ్చిమిర్చి - 3 (సన్నగా తరిగిన)
-అల్లం - 1/2 అంగుళం (సన్నగా తరిగిన)
-ఉప్పు
-ఆయిల్
కొత్తిమర తయారీ విధానం
-కొత్తిమీరను శుభ్రంగా కడిగి సన్నగా తరుగుకోవాలి.
-ఒక గిన్నెలో బియ్యప్పిండి, శనగపిండి, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి.
-తరిగిన కొత్తిమీరను పిండి మిశ్రమంలో వేసి బాగా కలపాలి. పిండిని మరీ పలుచగా చేయకూడదు కొంచెం గట్టిగా ఉండాలి.
-అందులోనే కొద్దిగా నీళ్లు పిండిని వడల పిండిలా కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేడి చేసి పిండిని చిన్న చిన్న వడలుగా వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి.
-వేడి వేడి కొత్తిమీర వడలు రెడీ.
.
-కొత్తిమీర వడను టొమాటో కెచప్ లేదా నచ్చిన చట్నీతో కలిపి తింటే
అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications