Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
శ్రీలంక స్టైల్ కోతు పరోటా.. రుచితో పాటు ఎన్నో పోషకాలు..!
కోతు పరోటా గురించి చాలా మంది విని వుండరు. ఈ వంటకం ఉత్తర భారతంలో చాలా పాపులారిటీని సాధించుకుంది. వర్షం పడే సమయంలో ఈ కోతు పరోటాను చేసుకొని తింటే అప్పుడు కలిగే ఆనందాన్ని మనం మాటల్లో వివరించలేము. రుచి మాత్రమే కాదు ఇందులో ఎన్నో పోషకాలు వుంటాయ్. అటు కార్బోహైడ్రేల్స్, ఫైబర్, ప్రొటీన్లు, మినరల్స్ ఇలా ఎన్నో పోషకాలు కలిగి వున్నాయ్. తమిళనాడులో ఈ కోతు పరోటాను స్ట్రీట్ ఫుడ్‌గా చూస్తారు. కోతు పరోటాలో కోతు అనే పదం తమిళం నుంచి వచ్చింది.

శ్రీలంకలో కూడా ఈ కోతు పరోటా చాలా ఫేమస్ అని చెబుతున్నారు. సింగపూర్, మలేషియా, మాల్దీవుల్లో కూడా ఈ డిష్‌కు చాలా పాపులారిటీ వుందని అంటున్నారు. కేరళలో కూడా ఈ డిష్‌కు పాపులారిటీ వుంది. కోతు పరోటా చేయడానికి ఎక్కువ ప్రత్యేకమైన వంటపదార్ధాలు అవసరం లేదు. ఇంట్లో వున్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ సమయంలో దీన్ని వండుకోవచ్చు. గంటల తరబడి దీని కోసం మనం కిచెన్‌లో గడపాల్సిన అవసరం అస్సలు లేదు.
కోతు పరోటా చేయడానికి ఈ కింద వంట సామాగ్రిని ముందుగా తెచ్చుకొని పెట్టుకోండి
5 పాతీలు
ఒక కప్పు ఉల్లిపాయలు
1 పచ్చిమిర్చి
1 కప్పు టమాటలు
1 టీస్పూన్ అల్లం
1 టీస్పూన్ వెల్లుల్లి
2 టేబుల్ స్పూన్ల నూనె
కరివేపాకులు
1/2 టీ స్పూన్ ఆవాలు
కారంపొడి
1/2 టీస్పూన్ గరం మసాలా
1 టీస్పూన్ ఫెన్నెల్ పౌడర్
తగినంత పసుపు
10 పూదీనా ఆకులు
2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకులు
3 గుడ్లు

కోతు పరోటా చేయడానికి స్టెప్ బై స్టెప్ ఈ కింది పద్ధతిని ఫాలో అవండి
1. 5 చపాతీలను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చించుకోవాలి, ఒక్కోటి సుమారు 1 ఇంచు సైజు వుండేలా చూసుకోవాలి. కత్తెరతో అయినా కట్ చేసుకోవచ్చు.
2. ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె పోసి వేడి చేసకోవాలి. అందులో ఆవాలు వేసి ఫ్రై చేయాలి. దీంతో పాటు కొన్ని కరివేపాకులను, 1 టీస్పూన్ అల్లంను, 1 టీస్పూన్ వెల్లుల్లి, నాలుగు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి.
3. వీటిని 3 నిమిశాల వరకు ఫ్రై చేయాలి. ఒక కప్పు తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకొని కలపాలి. ఉల్లిపాయ మరీ సన్నగా తరగకుండా మామూలుగా తరగాలి. ఉల్లిపాయ బంగారు రంగులో వచ్చేంత వరకు కలుపుకోవాలి. రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి.
4. 1 కప్పు తరిగిన టమాటాలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు మెత్తగా అయి రంగు మారేంతవరకు చూసుకొని అందులో కారంపొడి, గరం మసాలా, తగినంత పసుపు వేసుకోవాలి.
5. ఒక మూడు నిమిశాల వరకు వీటిని బాగా ఫ్రై చేయాలి. కొత్తిమీర, పూదీన ఆకులను కూడా వేసి మంచి వాసన వచ్చేంత వరకూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక కప్పు నీల్లు పోసుకుంటే మాడిపోకుండా కూర ఇంకా బాగా అవుతుంది.
6. మీకు కావాలనుకుంటే ఇందులో మూడు గుడ్లను కూడా వేసుకోవచ్చు. అయితే ఇది మాడిపోకుండా స్టవ్‌ను మీడియం ఫ్లేమ్ లేదంటే లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు చించిన లేదా కట్ చేసిన చపాతీ ముక్కలు ప్యాన్‌లో యాడ్ చేసుకోవాలి.
7. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని రోటీకి మసాలా బాగా అంటేలా చూసుకోవాలి. వీలైతే ప్యాన్‌లో వున్న పరోటా లేదా చపాతీ ముక్కలను మరింత చిన్నవిగా అయ్యేలా కట్ చేసుకోవాలి. కొన్ని నీళ్లను కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు.
8. కొన్ని కొత్తిమీర ఆకులను చల్లుకోవాలి. ఇక దీంతో మీ కోతు పరోటా రెడీ అయినట్టే. సాయంత్రం స్నాక్‌కు ఇది చాలా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications