Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
ఈ స్టైల్లో కొత్తిమీర రైస్‌ను ఎప్పుడైనా చేసుకున్నారా..? 10 నిమిశాల్లో రెడీ..!
ఏదైనా రుచిగా తినాలని అనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు వంట చేసుకోవడానికి ఎనర్జీ వుండదు. అలాంటి సందర్భంలో ఏదైనా ఫ్రై రైస్ చేయాలని అనుకుంటాం. అప్పుడు టమాటా రైస్, ఎగ్ రైస్ లాంటివి కాకుండా ఒక సారి ఈ కొత్తిమీర రైస్‌ను మేము చెప్పిన విధంగా చేసుకొని ట్రై చేయండి. కొత్తిమీర రైస్ రెసిపీని మీకోసం

కొత్తిమీర రైస్ కోసం కావాల్సిన వంట సామాగ్రి:
పావు కేజీ ఉడికిన అన్నం
మంచి నూనె
బిర్యానీ ఆకు, జిలుకర
ఉల్లిపాయ
1/4 కప్పు పచ్చి బఠానీ, 1/4 కప్పు క్యారెట్ ముక్కలు
ఉప్పు
1 కప్పు కొత్తిమీర ఆకులు
1 టేబుల్ స్పూన్ పూదీన ఆకులు
వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు
దాల్చిన చెక్క, లవంగాలు,
1 టీ స్పూన్ ధనియాల పొడి
1 టీ స్పూన్ వేయించి జిలుకర పొడి
1 టీ స్పూన్ నిమ్మరసం

కొత్తిమీర రైస్ తయారు చేసే విధానం:
1. కొంచెం వేడి అన్నంను తీసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టాలి.
2. స్టవ్‌పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల మంచి
నూనెను తీసుకోవాలి.
3. వేడవుతున్న నూనెలో ఒక బిర్యానీ ఆకును, అర టీస్పూన్ జిలుకర వేసి
ఫ్రై చేయాలి.
4. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి.
5. ఇందులో పావు కప్పు పచ్చి బఠానీలను వేసుకోవాలి.
6. పావు కప్పు క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి.
7. రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి.
8. 3 నిమిశాల వరకు ఉడికించాలి.
9. గ్రైండర్లో ఒక కప్పు కొత్తిమీర ఆకులను తీసుకోవాలి, 1
టేబుల్ స్పూన్ పూదీన ఆకులను కూడా వేసుకోవాలి.
10. వెల్లుల్లిపాయలను, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలను కూడా
వేసుకోవాలి.
11. దాల్చిన చెక్క, లవంగాలను కూడా వేసుకోవాలి.
12. ఈ మొత్తాన్ని గ్రైండర్లో గ్రైండ్ చేయాలి.
13. ప్యాన్‌లో బఠానీ, క్యారెట్ ఫ్రై అవుతుండగానే గ్రైండ్
చేసిన పేస్టును వేసుకోవాలి.
14. 3 నిమిశాల వరకు కలుపుతూ ఫ్రై చేయాలి.
15. పావు కేజీ ఉడికించిన చల్లార్చిన అన్నంను ప్యాన్‌లో
వేసుకొని కలుపుకోవాలి.
16. రుచికి సరిపడ ఉప్పును కూడా ఇందులో వేసుకోవాలి.
17. కొన్ని కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి.
18. ఒక టీ స్పూన్ ధనియాల పొడిని, వేయించిన జిలుకర పొడిని కూడా
వేసుకొని కలుపుకోవాలి.
19. ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకొని రైస్ మొత్తాన్ని బాగా
కలుపుకోవాలి.
20. ఇక దీంతో కొత్తిమీర రైస్ రెడీ అయినట్టే
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications