Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
Kurnool Special Uggani: కర్నూల్ స్పెషల్ ఉగ్గాని..5 నిమిషాల్లో రెడీ చేసుకోవడం ఎలాగో చూడండి
డైలీ బ్రేక్ ఫాస్ట్ లోకి ఇడ్లీ,పూరీ,దోశె,వడ,బోండా తిని తిని బోర్ కొట్టేసిందా? కొత్తగా ఏదైనా బ్రేక్ ఫాస్ట్ లోకి ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే త్వరగా రెడీ అయిపోయే ఉగ్గాని(uggani) బెస్ట్ ఆప్షన్. చాలా టేస్టీగా ఉండే ఈ ఉగ్గానిని పెద్దలతో పాటు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రాయలసీమతో పాటు కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో ఈ ఉగ్గాని బ్రేక్ ఫాస్ట్ గా చాలామంది తీసుకుంటారు. ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో ఏ మూరుమూల గ్రామానికి వెళ్లిన దొరికే టిఫిన్ ఐటమ్ ఈ ఉగ్గాని. కర్నూల్ వాళ్లకి ఉగ్గాని అంటే కేవలం బ్రేక్ ఫాస్ట్ ఐటమే కాదు ఓ ఎమోషన్ కూడా. కర్నూల్ స్పెషల్ ఉగ్గానిని(kurnool special uggani) కేవలం 5 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. ఉగ్గాని తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
ఉగ్గాని తయారీకి కావాల్సిన పదార్థాలు
-బొరుగులు
-టమాటో
-ఉల్లిపాయ
-కరివేపాకు
-ఆవాలు
-జీలకర్ర
-ఆయిల్
-శెనగపప్పు
-ఎండు కొబ్బరి పొడి
-ఎండుమిర్చి
-పసుపు
-కొత్తిమీర
-ఉప్పు
-కారం

ఉగ్గాని తయారీ విధానం
-ముందుగా 200 గ్రామల బొరుగులను నీళ్లల్లో వేసి బొరుగులను నీళ్లల్లో ముంచుతూ బాగా నానబెట్టండి.
-నానిన బొరుగులను గట్టిగా పిండి ఓ బౌల్ లో వేయండి.
-ఇఫ్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పే వేసి కలపండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో మూడు ఎండుమిర్చి, 70 గ్రాముల వేసిప శెనగపప్పు,2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి మెత్తని పొడి చేసుకొని దాన్ని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు 5 పచ్చిమిర్చి, రెండు రెబ్బల కకరివేపాకును రోట్లో లేదా మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా దంచుకోండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడి చేసుకోండి.
-వేడెక్కిన నూనెలో ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు, రెండు ఎండు మిర్చి వేసి వేపండి.
-ఇప్పుడు మీడియం సైజ్ లో కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ తరుగు, ఒక రెబ్బ కరివేపాకు బాండీలో వేసి రెండు నిమిషాలు వేపండి.
-ఇప్పుడు అందులో రెండు చిన్న టమోటోలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసిన తరుగు,రెండు చిటికెళ్ల పసుపు, గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి టామాటోలు మెత్తబడి నూనె పైకి తేలేవరకు వేపండి.
-ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ కారం వేసి కలపి నానబెట్టిన బొరుగులు, గ్రైండ్ చేసి ప్లేట్ లో పెట్టుకొని ఉన్న పప్పుల పొడి, ఒక కట్ట కొత్తిమీర తరుగు,రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలబెట్టండి.ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి అంతే కర్నూల్ స్పెషల్ ఉగ్గాని రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications