Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పాస్తాతో పాయసం.. లేట్ చేయకుండా ఇప్పుడే చేసుకోండి.. చాలా సింపుల్..!!
మ్యాకరోని పాస్తాతో మసాలా రెసిపీ కాకుండా స్వీట్ రెసిపీని చేసుకుందా. మాకరోని పాస్తాతో పాయసం చేసుకోవచ్చు. పాస్తాతో చేసిన పాయసం రుచి బహుశా మీరు చూసి ఉండరు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మాకరోని పాస్తాను ఎలా తయారు చేసుకోవాలో మీకు వివరిస్తాం. ఇది చేసుకోవడానికి ప్రత్యేకంగా వంట పదార్థాలు అవసరం లేదు. ఇంట్లో వున్న వాటితోనే పాస్తా పాయసాన్ని రెడీ చేసుకోవచ్చు.

మ్యాకరోని పాస్తా పాయసం తయారు చేసుకోవడానికి ఈ కింది వంట సామాగ్రిని రెడీ పెట్టుకోవాలి :
మ్యాకరోని పాస్తా: 1 కప్పు
పాలు: 1 లీటర్
చక్కెర: 3/4 కప్పు
యాలకుల పొడి: 1/2 టీస్పూన్
నెయ్యి: 1 టేబుల్ స్పూన్
గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టిన కిస్మిస్: 10-15
నానబెట్టిన బాదం, పిస్తా, కాజూ: 10-15
కుంకుమ పువ్వు: 1 చిటికెడు
మ్యాకరోని పాస్తా పాయసాన్ని ఈ కింది విధంగా తయారు చేసుకోవాలి :
1. ముందుగా, ఒక పెద్ద పాత్రలో నీరు మరిగించి అందులో ఒక చిటికెడు
ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా మరిగించాలి.
నీరు మరిగిన తరువాత, మ్యాకరోని పాస్తా వేసి 10 నిమిశాల వరకు అలాగే
ఉడికించాలి.
2. పాస్తా పూర్తిగా ఉడికిన తరువాత దాన్ని వడగట్టి, చల్లటి నీళ్లతో కడిగాలి. వీటిని ఒక బౌల్‌లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి.
3. ఒక ప్యాన్‌లో 1 లీటరు పాలు పోసి బాగా మరిగించాలి. అరగంట వరకు పాలను మరిగించాలి, ఇందులో ఉడకబెట్టిన పాస్తాను వేసుకొని బాగా కలుపుకోవాలి. చకెరను కూడా వేసి బాగా కలపాలి. ఇందులో యాలాకులు పొడి, కుంకుమ పువ్వును కూడా వేసుకోవాలి.
4. ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి బాదం, పిస్తా, కాజూ, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్‌ను పాస్తా పాయసంపై సర్వ్ చేసుకోవాలి. ఇక దీంతో మ్యాకరోని పాస్తా పాయసం రెడీ అయినట్టే.
చిట్కాలు:
పాస్తాను పూర్తిగా ఉడికించకండి, లేదంటే పాయసంలో గుజ్జుగా మారిపోతుంది. మీకు కావాల్సినంత చక్కెరను మాత్రమే యాడ్ చేసుకోవాలి. కుంకుమ పువ్వును ఖచ్ఛితంగా వేసుకోవాలని లేదు. పండుగల్లో, దేవుడికి ప్రసాదంగా కూడా ఈ మ్యాకరోని పాస్తాను చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications