Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కర్నాటక స్ట్రీట్ స్టైల్లో మద్దూర్ వడను ఇలా ఎప్పుడైనా చేసుకున్నారా..?
మద్దూర్ వడ కర్నాటకలో చాలా ఫేమస్. ఇది కర్నాటకలో బళ్లపై చేసి స్ట్రీట్ ఫుడ్‌లా అమ్ముతారు. సాయంత్రం సమయంలో చాలా మంది చాయ్'తో వీిని తీసుకుంటూ వుంటారు. కొబ్బరి చట్నీతో కూడా ఈ మద్దూర్ వడ చాలా బాగుంటుంది. వడ అనేది ముఖ్యంగా మన దక్షిణ భారత దేశం నుంచి వచ్చిందే. మనకు ఎన్నో రకాల వడలున్నాయ్. వాటిలో ఈ మద్దూర్ వడ ఒకటి. అయితే ఈ మద్దూర్ వడ ఎక్కువ రోజులుు నిల్వ చేసుకోవచ్చు. మరీ ఈ మద్దూర్ వడను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.

మద్దూర్ వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన వంట సామాగ్రిలు రెడీ చేసి పెట్టుకోవాలి
1 కప్పు బియ్యం పిండి
1/2కప్పు సెమోలినా
1/2 కప్పు కార్న్ ఆల్ పర్పస్ పిండి
1 కప్పు కోసిన ఉల్లిపాయలు
1 టేబుల్ స్పూన్ అల్లం
3 పచ్చి మిరపకాయలు
1/2 కప్పు కరివేపాకులు
1/2 టీస్పూన్ మిర్చీ పొడి
రుచికి సరిపడ ఉప్పు
2.1/2 టేబుల్ స్పూన్ల మంచి నూనె
10 కాజూలు లేదా 1.1/2 టేబుల్ స్పూన్ల నువ్వులు
2 కప్పుల మంచి నూనె

మద్దూర్ వడను ఈ కింది విధంగా రెడీ చేసుకోవాలి, చేయడం చాలా సింపుల్.
1. ముందుగా బౌల్లో 1 కప్పు బియ్యం పిండిని, 1/2 కప్పు చరోటీ రవ్వను, 1/2 కప్పు ఆల్ పర్పస్ పిండిని తీసుకోవాలి. తరువాత దీంట్లో 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు పొడవుగా వుండకుండా చూసుకోవాలి లేదంటే వడలు సరిగ్గా వచ్చే అవకాశం వుండదు.
2. పావు కప్పు కరివేపాకు ఆకులను, 1.1/2 టేబుల్ స్పూన్ తరిగిన అల్లంను, 3 తరిగిన పచ్చిమిరపకాయలను, 1 టీస్పూన్ ఉప్పును వేసుకోవాలి.
3. ఇప్పుడు బౌల్లో వున్న మొత్తాన్నీ కలుపుకోవాలి. కడాయిలో 2.1/2 టేబుల్ స్పూన్ల మంచి నూనెను వేడి చేసి బౌల్లో పోయాలి. ఒక టీస్పూన్ కారం పొడిని వేసుకోవాలి, 1.1/2 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి.
4. మీరు ముందగానే ఒకపక్కన కడాయిలో 2 కప్పుల మంచి నూనెను పోసి వేడి చేయాలి. మరో పక్క పిండి వున్న బౌల్లో పావు కప్పు నీళ్లు పోసి పిండిని బాగా కలుపుతూ వుండాలి. వడలు చేసుకునే విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు చేతిలోకి నూనె రాసుకొని పిండిని చిన్న చిన్న ఉండలుగా భాగాలుగా చేసుకోవాలి. వడను మరీ లావుగా, మరీన్నా సన్నగా వుండకుండా జాగ్రత్త పడాలి. వడ అంచులు చపాతీలాగా కరెక్ట్‌గా రానవసరం లేదు.
5. కడాయిలో నూనె వేడి అయిందా లేదా ముందుగా ఒకసారి చెక్క చేసుకోవాలి. కొంత పిండిని వేసి అది బాగా ఫ్రై అవుతుందా లేదా చూసుకోవాలి. నూనె వేడయిన తరువాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వడలను కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
6. మద్దూర్ వడలు మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి. మంటను అలాగే వుంచడం వల్ల వడలు మారిపోతాయ్. కాబట్టి మంటను తక్కువ చేసుకుంటూ, మీడియంలో పెట్టుకుంటూ వుండాలి.
7. వడలు క్రిస్పీగా రావడానికి కడాయిలో ముందు కొంచెంసేపు వేయించి బయటకు తీసి మళ్ల రెండవసారి వేయించాలి, ఇలా చేయడం వల్ల క్రస్పీగా అవుతాయ్. ఈ మద్దూర్ వడలను చట్నీ లేదంటే చాయ్‌తో సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రిజ్‌లో పెట్టుకొని ఓవెన్లో వేడి చేసుకొని తింటే ఈ మద్దూర్ వడలను ఎక్కువ రోజులు తినవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications