Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
Malai Kulfi Recipe : ఈ సారి బయట కాదు ఇంట్లోనే మలాయ్ కుల్ఫీని చేసుకొని తినండి..!
మండుతున్న ఎండలో మలాయ్ కుల్ఫీని తింటే ఎలా ఉంటుంది. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేము. ఎండాకాలంలో మలాయ్ కుల్ఫీ తినకపోతే ఇక బతికెందుకు అనుకునే వాళ్లున్నారు. వేసవిలో మామిడి పళ్లుకు ఎంత డిమాండ్ ఉంటుందో మలాయ్ కుల్ఫీకు కూడా అంతే. దాదాపు అందరూ మలాయ్ కుల్ఫీని బయటే కొని తింటారు. కానీ ప్రస్తుతం బళ్లపైన, హోటళ్లలో ఉండే కుల్ఫీని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదన్న విషయం మనకు తెలిసిందే. కాబట్టి మనం ఇంట్లోనే ఈ మలాయ్ కుల్ఫీని ఎలా తయారు చేసుకోవచ్చో మీకు అందిస్తున్నాం.
మలాయ్ కుల్ఫీ తయారు చేసే విధానం
మలాయ్ కుల్ఫీని కలపడానికి ఓ పెద్ద ప్యాన్‌ను తీసుకోవాలి. అందులో ముందుగా ఒక పావు కప్పు నీటిని పోయాలి. మంచి క్రీమి పాలు 1 లీటరును ప్యాన్‌లో వేసుకోని బాగా కలుపుకోవాలి. పాలు బాాగా మరిగేలా చూసుకోవాల.పైన మీగడ వస్తుంటే దానిని పక్కకు తీసుకుంటే అలాగే కలుపుకుంటూ ఉండాలి. పాలు థిక్‌గా అయ్యేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి. ఒక లీటరు పాలు పోస్తే అది మరిగి మరిగి అరలీటరు అయ్యేంత వరకు ఇలా చేయాలి.

పాలు చిక్కగా అయ్యేవరకు
మరుగుతున్న పాలల్లో 4 టేబుల్ స్పూన్ల చెక్కరను వేసి కలుపుతుండాలి. పాలు మరింత చిక్కగా అవడాన్ని చూస్తుంటాాం. పైకి మలాయ్ వస్తున్నా అలాగే కలుపుకుంటూ ఉండాలి. కొంత సమయం తరువాత పాల రంగు కూడా మారుతుంది. కొంచెం రుచికరంగా ఉండడానికి సరిపడా యాలాకుల పొడిని వేసుకొని కలుపుకోవాలి.స్టవ్ ఆప్ చేసుకొని ప్యాన్‌ను కిందకు దించుకోవాలి.
మనము తినే ఐస్‌క్రీం ఆకారం రావడానికి బయట మార్కెట్లో ఐస్‌క్రీం మౌల్డ్స్ ఉంటాయ్. డీమార్టుల్లో కూడా ఈ కుల్ఫీ మౌల్డ్స్‌ను అమ్ముతున్నారు. ఐస్‌క్రీం మౌల్డ్స్ లేకపోతే, ఇంట్లో ఉండే చిన్న గ్లాసులైనా ఉపయోగించవచ్చు.
కుల్ఫీ మౌల్డ్స్
మనము తయారు చేసుకునే కుల్ఫీ కేవలం ఐదు మైల్డ్స్‌లో మాత్రమే సరిపోతుంది. కాబట్టి ఐదు కుల్ఫీ మౌల్డ్స్‌ను తీసుకొని అందులో ప్యాన్‌ను కలుపుకున్న పాలని నింపాలి. మొత్తం ఐదు మౌల్డ్స్‌లో ఫిల్ చేసిన తరువాత ఒక్కో మౌల్డ్‌ను అల్యుమీనియం ఫాయిల్‌తో క్లోస్ చేయాలి. తినడానికి వీలుగా ఉండేలా ఒక ఐస్‌క్రీమ్ స్టిక్‌ను మౌల్డ్‌లో సెట్ చేయాలి. ఈ కుల్ఫీ మౌల్డ్స్ అన్నింటినీ 8 గంటలపాటు డీప్ ఫ్రీజర్‌లో వుంచాలి. తరువాత వీటిని బయటకు తీసి మీ ఇంట్లో పిల్లకు ఇచ్చి మీరు తింటూ ఎంజాయ్ చేయండి.
ప్రతీసారి కుల్ఫీ బయటే తింటాము. ఈ సారి మీరు ఇంట్లో దీనిని తయారు చేసుకోండి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. కావలసింది, పాలు చెక్కర మాత్రమే. మరింకెందుకు ఆలస్యం చేసుకోండి మలాయ్ కుల్ఫీ సింపుల్‌గా సూపర్బ్‌గా.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications