మామిడికాయ పచ్చి పులుసును ఎలా తయారు చేసుకోవాలి..?

Posted By:

మామిడికాయ పచ్చిపులుసును ఇష్టపడని వారు ఎవరుంటారు. ఎండాకాలంలో మామిడికాయ పచ్చి పులుసును అస్సలు మిస్ కావద్దు. పచ్చిపులుసే అయినా దీంట్లో పుష్కలంగా వైటమిన్ సి పోషకాలు వుంటాయ్. శరీరానికి చాలా చలువ చేస్తుంది. మామిడికాయ పచ్చిపులుసు చేయడానికి ముందుగా పుల్లటి మామిడికాయలను తీసుకోవాలి. మామిడికాయ ఎంత పుల్లగా వుంటే పచ్చి పులుసు అంత పుల్లగా వుంటుంది. స్టవ్ పైన ఒక స్టాండ్ పెట్టుకొని మామిడికాయలను కాల్చుకోవాలి. ఇలా కాల్చడం వల్ల పచ్చిపుల్సు టేస్టు డబల్ అవుతుంది. మామిడికాయ నల్లగా వచ్చేంత వరకు అలాగే కాల్చుకోవాలి. మొత్తం మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.

ఇప్పుడు కాలుతున్న మామిడికాయను ఒక ప్లేటులోకి తీసుకోవాలి. మూడు పచ్చిమిరపకాయలను కూడా కాల్చి తీసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలను కాల్చడం వల్ల పచ్చిపులుసు టేస్టు ఇంకా బాగా వస్తుంది. కాల్చిన పచ్చిమిరపకాయలను ప్లేటులోకి తీసుకోవాలి. ఒక ప్యాన్‌లోకి పావు టీస్పూన్ మెంతులను, ఒక టీస్పూన్ ధనియాలను తీసుకోవాలి. అర టీస్పూన్ జిలకర, ఒక టీస్పూన్ నువ్వులను వేసుకోవాలి. వీటన్నింటినీ ఇప్పుడు ప్యాన్‌లో బాగా వేయించాలి. బాగా వేగిన తరువాత ఇందులోనే రెండు ఎండిమిరపకాయలను వేసుకోవాలి. పచ్చి మిరిచి స్పైసీగా వుండాలంటే మరో రెండు ఎండి మిర్చిలను యాడ్ చేసుకోవాలి.

మరోపక్క కాల్చిన మామిడికాయ తొక్కను తీసివేసి బాగా కడిగాలి. ఇప్పుడు దాన్ని ముక్కలుగా కోసుకోవాలి. కట్ చేసిన ముక్కలను మిక్సర్ జార్‌లో తీసుకోవాలి. ఇందులోనే ఇంతకు ముందు వేయించిన వాటిని జార్‌లో వేసి దాన్ని కూడా మెత్తని పోడిలా తయారు చేసుకుందాం. ఈ పొడిని మామిడికాయ పచ్చిపులుసులో వేస్తే మామిడికాయ పులుసును బ్యాలెన్స్ చేసినవారమౌతాము. ఇదే మిక్సీజార్‌లో మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. వీటితో పాటు కాల్చిన పచ్చిమిర్చీలను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలను, మసాలాలను, కొన్ని నీళ్లను వేసుకొని బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు ఈ రసంలో కొన్ని ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. పావు టీస్పూన్ పసుపు కూడా అందులో వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన రసం ఎలా వుందో రుచి చూడాలి. ఈ రసంలో ఉప్పు, కారం తగ్గినట్లు అనిపిస్తే మరికొంత వేసుకోవాలి. ఈ మామిడికాయ పచ్చిపులుసులోకి పోపును వేసి రెడీ చేసుకుందాం. పోపులో మామిడికాయ రసాన్ని వేసి కలుపుకోవాలి. దీంతో మామిడికాయ పచ్చిపులుసు రెడీ అయినట్టే. ఈ పచ్చిపులుసును అన్నంలో లేదంటే ఈ పులుసులో చపాతీలను చించుకొని కలుపుకొని తినాలి.

మామిడికాయ పచ్చిపులుసులో పోషకాలు

మామిడికాయ పచ్చిపులుసులో వైటమిన్ సి పుష్కలంగా వుంటుంది. ఎండాకాలంలో దీన్ని వారానికి ఒక్కసారైనా ఇంట్లో ఖచ్చితంగా చేసుకోండి. వేసవిలో మండిపోయే ఎండలో ఈ మామిడికాయ పులుసును తయారు చేసుకొని తింటే శరీరం చల్లగా అవుతుంది. రక్తపోటు, షుగర్ లెవెల్స్ అన్నీ అదుపులోకి వస్తాయ్. ఇక ఒక కప్పు మామిడికాయ ముక్కలో ఎన్ని పోషకవిలువలుంటాయన్న విషయానికి వస్తే.. ఒక కప్పు మామిడిముక్కలో 99 క్యాలరీలు వుంటాయ్, ప్రొటీన్లు 1.4 గ్రాములుంటాయ్, 24.7 గ్రాముల కార్బోహైడ్రేట్లు వుంటాయ్, ఫైబర్ 2.6 గ్రాములుంటుంది. వీటితో పాటు వైటమిన్ సి, కాపర్, ఫోలేట్, వైటమిన్ బి6, వైటమిన్ ఏ, వైటమిన్ ఈ, వైటమిన్ కె, నియాసిన్, పొటాషియం, రైబోఫ్లోవిన్, మెగ్నీషియం, థియామైన్.

[ of 5 - Users]
Story first published: Sunday, May 26, 2024, 19:53 [IST]
Desktop Bottom Promotion