Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Mango recipes : ఈ వేసవిలో టేస్టీ పుల్లటి మామిడికాయ పులిహోరను చేసుకుందాం..
పులిహోర. నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర ఇలా రెండు రకాల పులిహోరను మనం ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ వేసవిలో మామికికాయ పులిహోరను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
మామిడికాయ పులిహోర తయారు చేసే విధానం
రైస్
ముందుగా పులిహోరను వండుకోవడానికి రైస్ కుక్కర్‌లో ఒక కప్పు రైస్‌ను తీసుకొని, బాగా కడిగి ఒకటిన్నర కప్పు నీళ్లతో రైస్‌ను స్టవ్‌పై వండుకోవాలి. పులిహోర కోసం వండుతున్న రైస్ కాబట్టి అన్నం అతుక్కోకుండా ఉండడానికి ముందుగానే రెండు స్పూన్ల నూనెను వేసుకోవాలి. రెండు కుక్కర్ విజిల్స్ తరువాత రైస్‌ను కిందకు దించివేయాలి. కుక్కర్‌లోని రైస్‌లో రెండు టీ స్పూన్ల నూనె, సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

మసాలా పొడి
ఒక ప్యాన్‌లో పావు టీస్పూన్ మెంతులను, 15 మిరియాలను, ఒక టీ స్పూన్ ధనియాల, ఒక టీ స్పూన్ నువ్వులను, ఒక టీ స్పూన్ జిలకర తీసుకొని ప్యాన్‌లో బాగా వేపుకోవాలి. మీడియం ఫ్లేంపైనే వీటిని వేపి తరువాత ఒక రోల్‌లో తీసుకొని పొడి అయ్యేవరకు దంచుకోవాలి.
మామిడికాయ
ఒక మామిడికాయను తీసుకొని పొట్టును తీసి సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో చల్లబడిన రైస్‌లో ఈ మామిడి తురుమును వేసుకొని బాగా కలుపుకోవాలి. మామిడికాయ ఎంత పుల్లగా ఉండే మామిడికాయ పులిహోర అంత రుచిగా వస్తుంది. కాబట్టి ముందుగానే మంచి మామిడికాయను చూసి ఎంచుకోవాలి.
పోప్
ఇప్పుడు రైస్‌ను ఫ్రై చేయడానికి ఒక ప్యాన్‌లో మూడు టేబుల్ స్పూన్ల మంచి నూనెను వేసుకొని సరిపడా పల్లీలను వేసుకొని వేపుకోవాలి. అందులోనే ఒక టీ స్పూన్ పచ్చి చెనగపప్పును, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినపప్పును వేసుకొని బాగా ఫ్రైచేయాలి. పోషకాలు, రుచి కోసం రెండు స్పూన్ల జీడిపప్పులను యాడ్ చేసుకోవాలి. రుచి, ఘాటు కారం కోసం 4 ఎండుమిర్చీలను వేసి ఫ్రై చేసుకోవాలి. కావలసినన్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మామికికాయ పులిహోరకు కావలసిన పోప్ రెడీ అయింది.
మామిడికాయ పులిహోర రెడీ
రెడీ అయిన ఈ పోప్‌ను కుక్కర్‌లో ఉన్న రైస్‌లో వేసి బాగా కలుపుకోవాలి. రుచి కోసం అవసరమైతే కొంచెం ఉప్పును యాడ్ చేసుకోవచ్చు. దీంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications