Latest Updates
-
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక
మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
తెలుగువారికి చాలా పసందైన వంటకం మామిడికాయ పచ్చడి. ఎండాకాలం వచ్చి ఉగాది అయిపోగానే దాదాపు అందరి ఇళ్లల్లో ఈ మామాడికాయ పచ్చడిని పెట్టుకుంటారు. ఎన్నో యేళ్ల నుంచి ఇలా ఎండాకాలంలో మామికియ పచ్చడిని పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం అదే మామిడికాయ పచ్చడిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటున్నాం.

మామిడికాయ పచ్చడిని బయట ఎక్కడకొన్నా కూడా అమ్మమ్మో లేక నానమ్మో చేసిన రుచి దేనికీ ఉండదు. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యివేసి మామిడికాయ పచ్చడితో కలుపుకొని తింటే ఏ భిర్యానీ కూడా అవసరం లేకుండా కడుపునిండా పచ్చడితోనే లాగించేయవచ్చు. దీనికి ముద్దపప్పు కాంబినేషన్ యాడ్ చేస్తే ఇక ఆ రుచి నోటితో చెప్పనవసరం లేదు.
మామిడికాయ పచ్చడిని తయారు చేసేవిధానం
పచ్చడి బాగా రుచిగా రావాలంటే మామిడికాయ ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాయ కచ్చిగా అంటే గట్టిగా ఉండాలి, రుచి చాలా పుల్లగా ఉండాలి. మామిడికాయ కొంచెం మెత్తబడ్డా కూడా పచ్చడిలో రుచి రాదు. ఎంత పుల్లగా ఉంటే అంత రుచి అనుకోవచ్చు.
పచ్చడిలో వాడే కారం కూడా బయట దొరికే బ్రాండ్లు కాకుండా మీరే స్వయంగా ఎండిమిరపకాయల కారాన్ని పట్టించి దానితో చేయడం మంచిది. కుదిరితే గుంటూరు ఎండిమిర్చితో కారం పట్టించి చేస్తే రుచి అదిరిపోతుంది. బయట ప్యాకెట్లలో వచ్చే కారాన్ని కూడా వాడవచ్చు కానీ స్వచ్ఛమైన కారం కాదు కాబట్టి రుచి తగ్గుతుంది.
కట్ చేసిన మామిడి ముక్కలను ఒక బౌల్‌లో తీసుకొని ముక్కలు మునిగేంత వరకు అందులో నూనె పోయాలి. ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి. ఆవపిండి, మెంతి పిండిని కూడా అవసరమైనంత పట్టుకొని పచ్చడిలో బాగా కలుపుకోవాలి. మామిడికాయలు కొట్టించేటప్పుడు, మిర్చి ఇంకా ఆవపిండి, మెంతిపిండి పట్టించేటప్పుడు అందులో చెత్త లేకుండా జాగ్రత్త పడాలి.
పై చెప్పినవాటన్నింటినీ బాగా కలుపుకోని రుచిని చూసుకుంటూ ఏది తక్కువైందో పచ్చడిలో కలుపుకుంటూ ఉండాలి. అయితే రుచి చూసేటప్పుడు ఓ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే కలిపిన పచ్చడి రుచి, మూడు రోజుల తరువాత అదే పచ్చడి రుచి ఒకేలా ఉండదు. పచ్చడి కలుపుకోగానే చేదుగా ఉంటుంది. కానీ తరువాత కారం, మమిడి, ఉప్పూ అన్నీ బాగా కలిసిన తరువాత అసలైన రుచి బయటకు వస్తుంది.
కలిపిన పచ్చడిని ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా పచ్చళ్ల కోసం ప్రత్యేక తయారు చేసిన కుండలో పెట్టి నిలవ ఉంచితే రుచిపోకుండా బూజుపట్టకుండా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications