Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
ఈ మసాలా కూర తింటే, నోట్లో నుంచి లాలాజలం ఏరులైపారాల్సిందే.. అద్భుతమైన రుచి.. ఎలా చేసుకోవాలంటే?
మన తెలుగు ప్రజలకు మసాలాలు అంటే ఎంతో ప్రీతీ ఉంటుంది. ప్రతి దానిలోనూ ఘాటైన మసాలా ఉండాల్సిందే. అదేంటో మసాలా లేకపోతే ఆ కూర రుచి కూడా ఉండదు. అందుకే అందరూ సాధారణంగా కూరల కంటే మసాలా కూరలనే ఎక్కువగా ఇష్టపడతారు. ఈ నేపథ్యంలోనే మసాలా వంకాయ కూర, మసాలా దొండకాయ కూర వంటివి చేసుకుంటారు. కానీ మీరెప్పుడైనా బీరకాయ మసాలా కూర తిన్నారా? సాధారణంగా బీరకాయను సాధారణంగా రోగుల కోసం ఉపయోగించే కూరగాయగా భావిస్తారు.
కానీ ఈ కూరను కూడా ఎంతో రుచికరమైన మసాలా కర్రీగా తయారుచేయవచ్చు. ఈ కూర రుచి ఓసారి చూస్తే ఇక అంతే.. జన్మలో మళ్ళీ దాన్ని వదలరు, డబల్ ధమాకా రుచితో అదిరిపోతుంది చెప్పుకోవచ్చు. అయితే చాలా మందికి దీనిని ఎలా చేసుకోవాలో తెలియదు. అందుకే ఈ స్టోరీలో బీరకాయ మసాలా కూర ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది తెలుసుకుందాం.
బీరకాయ మసాలా కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు:
బీరకాయలు - 3
నువ్వులు - 2 స్పూన్లు
పల్లీలు - 1 కప్పు
కొబ్బరి తురుము - 1/2 కప్పు
జీలకర్ర - 1 స్పూను
ఉప్పు - రుచికి తగినంత
పసుపు - 1/2 స్పూను
కరివేపాకు - కొన్ని
నూనె - 4 స్పూన్లు
ధనియాల పొడి - 1 స్పూను
కారం - 1 స్పూను
వెల్లుల్లి రెబ్బలు - 10
పురాతన రాజులు మటన్‌ను ఇలాగే వండుకొని తినేవారు, చాలా టేస్టీ గురూ.. ఎలా చేసుకోవాలో తెలుసా?
తయారుచేసే విధానం:
ముందుగా మనం తీసుకున్న బీరకాయలకు పొట్టు తీసుకోవాలి. ఆ తరువాత ఆ బీరకాయలను శుభ్రంగా తీసుకొని, దొండకాయ మాదిరిగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బీరకాయలను ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి. అందులో పల్లి, నువ్వులు వేసుకొని.. మరీ మాడకుండా మరీ అస్సలు కాలకుండా ఉండకుండా.. అలా పైపైన కాల్చుకోవాలి.
ఇప్పుడు ఒక మిక్సీ తీసుకోవాలి. అందులో పల్లీలు, నువ్వులు, వెల్లుల్లిపాయలు, ధనియాల పొడి, జీలకర్ర, పసుపు, కారం, ఎండు కొబ్బరి తురుము, మరియు ఉప్పు వేసి మెత్తగా పొడిగా మిక్స్ చేసుకోండి. ఈ పొడి పూర్తయ్యాక.. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలో ఈ పొడిని మధ్య భాగంలో నింపుకోవాలి. అటూ ఇటూ అతుక్కోకుండా కొంచెం అందంగా, నీటిగా నింపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత అందులో కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. ఆ తర్వాత బీరకాయ ముక్కలను వేసి, మసాలా ముక్కలు మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోండి.
మసాలా మిశ్రమం మరియు నీరు చేర్చండి: బీరకాయ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత, మీరు ముందు చేర్చిన మసాలా పొడిని వేసి, నీరు జోడించి, సన్నగా మంట మీద మగ్గించుకోవాలి. ఇది మసాలా కూరలాగా అయ్యేవరకు ఉడికించండి. అనంతరం పైన కొత్తిమీర తరిగి చల్లుకుంటే ఎంతో రుచికరమైన బీరకాయ మసాలా కూర సిద్ధమైనట్లే. బీరకాయ మసాలా కర్రీని వేడి వేడి అన్నంతో వడ్డించుకొని, కొంచెం నెయ్యి తగిలించి తింటే ఆహా రుచికి నోరంతా పడిపోవాల్సిందే. అద్భుతం అని చెప్పుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












