నంచుకోవడానికి మసాలా మిర్చి.. టేస్ట్ సూపర్‌గా వుంటుంది..!

Posted By:

అన్నం తినే సమయంలో నంచుకోవడానికి ఏదైనా కావాలి. నంచుకోవడానికి మిర్చి బజ్జి, పచ్చడి, వడియాలు, గుడ్డు, ఇలా ఏదైనా ఒకటి నంచుకోవడానికి ఖచ్ఛితంగా వుండాలి. ఇదే ప్రధానంగా ఈ రోజు మీకు మిర్చి ఫ్రై రెసిపీని మీ ముందుకు తీసుకొని వచ్చాము. మిర్చి ఫ్రైని నంచుకొని తింటే ఆహా ఏమి రుచి, తినరా మైమరచి అని అనాల్సిందే.

మసాలా మిర్చి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్

దొడ్డు మిరపకాయలు, కారం, చెనగపిండి, పసుపు, కారంపొడి, ధనియాల పొడి, ఆంచూర్ పొడడి, గరం మసాలా, జిలకర పొడి, కసూరి మేథి, ఉప్పు

మసాలా మిర్చి ఫ్రై తయారు చేసే విధానం

మసాలా మిర్చీ తయారు చేసుకోవడానికి పావుకిలో దొడ్డు మిర్చీలను తీసుకోవాలి. ఈ దొడ్డు మిర్చీతో టేస్ట్ బాగా వస్తాయ్. కారం కూడా తక్కువగా వుండడం వల్ల బాగుంటుంది. తీసుకున్న మిరపకాయలను ఒక బౌల్‌లో నీటిలో వేసి బాగా కడగాలి. కడిగిన తరువాత మిరపకాయలను బట్టతో శుభ్రంగా తుడిచివేయాలి. తరువాత మిరకపకాయలన్నింటికీ చాకుతో గాట్లు పెట్టాలి.

మిర్చీకి ఒక పక్కనే గాటు పెట్టాలి. గాటు పెట్టిన తరువాత మిర్చీ లోపల వున్న విత్తనాలను బయటకు తీసివేయాలి. మిర్చీలో మసాలా వేయడానికి మసాలాను రెడీ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్‌లో అరకప్పు చెనగపిండిని తీసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి శెనగపిండిని బాగా వేపాలి. చెనగపిండిని ఎంత బాగా వేపితే రుచి అంత బాగా వస్తుంది. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 6 నుంచి 7 నిమిశాల వరకు చెనగపిండిని వేపాలి.

చెనగపిండి బాగా వేగిన తరువాత కమ్మని వాసన రావడం మనం చూస్తూనే వుంటాం. పిండిని ఆపకుండా కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. పిండి కలర్ మారుతుందనుకున్నప్పుడే అందులో స్పైసెస్‌ను యాడ్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టటి స్పైసెస్‌ను యాడ్ చేసుకోవాలి.

అర టీస్పూన్ పసుపు, 2 టీస్పూన్ల కారంపొడి, 2 టీస్పూన్ల ధనియాల పొడిని, 2 టీస్పూన్ల ఆంచూర్ పొడిని తీసుకోవాలి. ఆంచూర్ పొడి వల్ల కొంచెం పెల్లగా టేస్టీగా అవుతుంది. అరటీస్పూన్ గరం మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి. అర టీస్పూన్ వేపిన జిలకర పొడిని, 1 టీ స్పూన్ కసూరి మేథిని తీసుకోవాలి. గతినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి.

మీడియం ఫ్లేమ్‌లో పెట్టి పిండిని ఫ్రై చేసుకోవాలి. కేవలం రెండు మూడు నిమిశాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేయడం వల్ల పొడి మాడిపోతుంది. ఫ్రై అయిన మసాలా పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

ఇప్పుడు గాటు పెట్టిన మిరపకాయల్లో ఈ మసాలాను నింపుకోవాలి. స్టఫ్ అంతా నింపిన తరువాత కొంచెం మసాలాను మిగిలిపోతుంది. ఫ్రై చేసేందుకు ఈ మసాలా పొడి బాగా ఉపయోగపడుతుంది.

ఒక ప్యాన్‌లో 4 టేబుల్ స్పూన్ల మంచి నూనెను యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి మరికొంత నూనెను యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయిన తరువాత అర టీస్పూన్ జిలకరను యాడ్ చేసుకోవాలి. కట్ చేసిన 7 నుంచి 8 అల్లం ముక్కలను యాడ్ చేసుకోవాలి. వీటిని నూనెలో దోరగా ఫ్రై చేసుకోవాలి.

ఇప్పుడు ఈ ప్యాన్‌లో స్టఫ్ చేసిన మిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్ని మిరపకాయలను ప్యాన్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు మొత్తాన్ని మూడు నుంచి నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిరపకాయలపై మిగిలిన మసాలా పొడిని చల్లుకోవాలి. లో ఫ్లేమ్‌లో మిరపకాయలను ఫ్రై చేసుకోవాలి. ఇలా మూడు నిమిశాలు మిరకపకాయలను ఫ్రై చేసుకోవాలి. దీంతో మసాలా మిర్చీ ఫ్రై రెడీ అయినట్టే.

[ of 5 - Users]
Story first published: Sunday, June 2, 2024, 12:58 [IST]
Desktop Bottom Promotion