Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
నంచుకోవడానికి మసాలా మిర్చి.. టేస్ట్ సూపర్‌గా వుంటుంది..!
అన్నం తినే సమయంలో నంచుకోవడానికి ఏదైనా కావాలి. నంచుకోవడానికి మిర్చి బజ్జి, పచ్చడి, వడియాలు, గుడ్డు, ఇలా ఏదైనా ఒకటి నంచుకోవడానికి ఖచ్ఛితంగా వుండాలి. ఇదే ప్రధానంగా ఈ రోజు మీకు మిర్చి ఫ్రై రెసిపీని మీ ముందుకు తీసుకొని వచ్చాము. మిర్చి ఫ్రైని నంచుకొని తింటే ఆహా ఏమి రుచి, తినరా మైమరచి అని అనాల్సిందే.
మసాలా మిర్చి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్
దొడ్డు మిరపకాయలు, కారం, చెనగపిండి, పసుపు, కారంపొడి, ధనియాల పొడి, ఆంచూర్ పొడడి, గరం మసాలా, జిలకర పొడి, కసూరి మేథి, ఉప్పు
మసాలా మిర్చి ఫ్రై తయారు చేసే విధానం
మసాలా మిర్చీ తయారు చేసుకోవడానికి పావుకిలో దొడ్డు మిర్చీలను తీసుకోవాలి. ఈ దొడ్డు మిర్చీతో టేస్ట్ బాగా వస్తాయ్. కారం కూడా తక్కువగా వుండడం వల్ల బాగుంటుంది. తీసుకున్న మిరపకాయలను ఒక బౌల్‌లో నీటిలో వేసి బాగా కడగాలి. కడిగిన తరువాత మిరపకాయలను బట్టతో శుభ్రంగా తుడిచివేయాలి. తరువాత మిరకపకాయలన్నింటికీ చాకుతో గాట్లు పెట్టాలి.

మిర్చీకి ఒక పక్కనే గాటు పెట్టాలి. గాటు పెట్టిన తరువాత మిర్చీ లోపల వున్న విత్తనాలను బయటకు తీసివేయాలి. మిర్చీలో మసాలా వేయడానికి మసాలాను రెడీ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్‌లో అరకప్పు చెనగపిండిని తీసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి శెనగపిండిని బాగా వేపాలి. చెనగపిండిని ఎంత బాగా వేపితే రుచి అంత బాగా వస్తుంది. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 6 నుంచి 7 నిమిశాల వరకు చెనగపిండిని వేపాలి.
చెనగపిండి బాగా వేగిన తరువాత కమ్మని వాసన రావడం మనం చూస్తూనే వుంటాం. పిండిని ఆపకుండా కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. పిండి కలర్ మారుతుందనుకున్నప్పుడే అందులో స్పైసెస్‌ను యాడ్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టటి స్పైసెస్‌ను యాడ్ చేసుకోవాలి.
అర టీస్పూన్ పసుపు, 2 టీస్పూన్ల కారంపొడి, 2 టీస్పూన్ల ధనియాల పొడిని, 2 టీస్పూన్ల ఆంచూర్ పొడిని తీసుకోవాలి. ఆంచూర్ పొడి వల్ల కొంచెం పెల్లగా టేస్టీగా అవుతుంది. అరటీస్పూన్ గరం మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి. అర టీస్పూన్ వేపిన జిలకర పొడిని, 1 టీ స్పూన్ కసూరి మేథిని తీసుకోవాలి. గతినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి.
మీడియం ఫ్లేమ్‌లో పెట్టి పిండిని ఫ్రై చేసుకోవాలి. కేవలం రెండు మూడు నిమిశాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేయడం వల్ల పొడి మాడిపోతుంది. ఫ్రై అయిన మసాలా పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఇప్పుడు గాటు పెట్టిన మిరపకాయల్లో ఈ మసాలాను నింపుకోవాలి. స్టఫ్ అంతా నింపిన తరువాత కొంచెం మసాలాను మిగిలిపోతుంది. ఫ్రై చేసేందుకు ఈ మసాలా పొడి బాగా ఉపయోగపడుతుంది.
ఒక ప్యాన్‌లో 4 టేబుల్ స్పూన్ల మంచి నూనెను యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి మరికొంత నూనెను యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయిన తరువాత అర టీస్పూన్ జిలకరను యాడ్ చేసుకోవాలి. కట్ చేసిన 7 నుంచి 8 అల్లం ముక్కలను యాడ్ చేసుకోవాలి. వీటిని నూనెలో దోరగా ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఈ ప్యాన్‌లో స్టఫ్ చేసిన మిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్ని మిరపకాయలను ప్యాన్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు మొత్తాన్ని మూడు నుంచి నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిరపకాయలపై మిగిలిన మసాలా పొడిని చల్లుకోవాలి. లో ఫ్లేమ్‌లో మిరపకాయలను ఫ్రై చేసుకోవాలి. ఇలా మూడు నిమిశాలు మిరకపకాయలను ఫ్రై చేసుకోవాలి. దీంతో మసాలా మిర్చీ ఫ్రై రెడీ అయినట్టే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications