Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
టేస్టీ మసాలా పాస్తా.. ఈ స్టైల్లో ఎప్పుడైనా చేసుకున్నారా..?
పాస్తా టేస్టు, పాస్తా వండితే వచ్చే వాసన నాన్‌వెజ్ లాగే వుంటుంది. శాఖాహారులు తమ జీవితంలో ఎప్పుడూ మాంసం తినకపోతే వారికి పాస్తా తినిపించాలి. నాన్ వెజ్ కూడా పాస్తా టేస్టే వుంటుందని చెప్పాలి. అప్పుడైనా వారు మటన్, చికెన్‌ను తినడానికి ముందుకు వస్తారు. మసాలా పాస్తాను వండి మీ శ్రేేయోభిలాషుల్లో శాఖాహారులకు తినిపించండి. మసాలా పాస్తా ఎలా రెడీ చేసుకోవాలో మీకు చెప్పుబోతున్నాం.

మసాలా పాస్తా తయారు చేయడానికి కావాల్సిన వంట సామాగ్రి
ఉప్పు
5 టేబుల్ స్పూన్ల మంచి నూనె
1.1/2 కప్పు పాస్తా
1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు
1/2 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు
1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు
1 టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కలు
1 టేబల్ స్పూన్ క్యాప్సికం ముక్కలు
1/2 కప్పు చిన్నగా కోసిన టమాట
1/4 టీ స్పూన్ మిరియాల పొడి
1/2 టీ స్పూన్ కారంపొడి
1/2 టీ స్పూన్ ధనియాల పొడి
1/2 టీ స్పూన్ గరం మసాలా
1 టేబుల్ స్పూన్ టమాట సాస్
1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్
కొత్తిమీర ఆకులు

మసాలా పాస్తా తయారీ విధానం
1. ఒక గిన్నెలో 5 కప్పుల నీళ్లకు తీసుకోవాలి.
2. నీళ్లకు స్టవ్‌పై పెట్టి వేడి చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల ఆయిల్‌ను వేసి వేడిచేసుకోవాలి.
3. వేడి అవుతున్న నీళ్లల్లో ఒకటిన్నర కప్పు పాస్తాను వేసుకోవాలి.
4. పాస్తాను 12 నిమిశాల వరకు బాగా ఉడికించాలి.
5. ఉడికిన పాస్తాను జాలిగంటతో ప్లేటులోకి తీసుకోవాలి.
6. ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల వరకు మంచి నూనెను తీసుకోవాలి.
7. వేడవుతున్న ఆయిల్లో అర టీస్పూన్ అల్లం ముక్కలను, అర టీస్పూన్ వెల్లుల్లి ముక్కలను వేసుకోవాలి.
8. రెండు పచ్చిమిరపకాయలను, అర కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి.
9. 1 టేబల్ స్పూన్ వరకు క్యారెట్ ముక్కలను, 1 టేబుల్ స్పూన్ క్యాప్సికం ముక్కలను వేసుకోవాలి.
10. 1/2 కప్పు టమాటాలను చిన్నగా కోసి తీసుకోవాలి.
11. 3 నిమిశాల వరకు దీన్ని బాగా ఫ్రై చేయాలి.
12. పావు టీస్పూన్ మిరియాల పొడి, అర టీ స్పూన్ కారంపొడి, అర టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ గరం మసాలా, రుచికి సరిపడ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ టమాట సాస్, 1 టీస్పూన్ రెడ్ చిల్లీ సాస్‌ను వేసి మిక్స్ చేయాలి.
13. లో ఫ్లేమ్‌లో వీటిని 1 నిమిశం వరకు ఫ్రై చేయాలి.
14. ఇందులో ఉడికించిన పాస్తాను యాడ్ చేసుకోవాలి.
15. స్టవ్‌ను హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా కలుపుకోవాలి.
16. తరిగిన కొత్తిమీరను పాస్తాపై వేసి కలుపుకోవాలి.
17. ఇక మసాలా పాస్తా రెడీ అయినట్టే. సాయంత్రం సమయంలో స్నాక్‌గా లేదంటే ఉదయం టైం లేనప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌గా తినవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications