Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
ఇలా మటన్ టేస్టు వచ్చేలా మిల్ మేకర్ కర్రీని ఎప్పుడైనా చేసుకున్నారా..?
మిల్ మేకర్ అంటే శాఖాహారులకు నాన్‌వెజ్ లాంటిది. మటన్ ముక్కలు ఎంత టేస్టీగా తింటామో, శాఖాహారులు కూడా మిల్ మేకర్‌ను అంత మనస్పూర్తిగా తింటారు. రుచి మాత్రమే కాదు, మిల్ మేకర్లో ప్రొటీన్లు పుష్కలంగా వుంటాయ్. మటన్ కర్రీ టేస్టు వచ్చే మిల్ మేకర్‌ను ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్పబోతున్నాం. మిల్ మేకర్ రెసిపీని మీకు అందిస్తున్నాం.
మిల్ మేకర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన వంట సామాగ్రి
మిల్ మేకర్లు, ఉప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలాకులు, ధనియాలు, మిరియాలు, జీడిపప్పులు, సోంపు, జిలుకర, టమాట, మంచి నూనె, ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, కారంపొడి, ధనియాల పొడి, కొత్తిమీర ఆకులు.

మిల్ మేకర్ కర్రీ తయారు చేసుకునే విధానం
1. ముందుగా ఒక గిన్నెలోకి 2 నుంచి 3 గ్లాసుల నీళ్లను తీసుకొని బాగా వేడి చేయాలి. నీళ్లు ఎప్పుడైతే బాగా వేడవుతాయో అప్పుడ అర టీస్పూన్ ఉప్పును నీళ్లల్లో వేసుకోవాలి. ఒక కప్పు మిల్ మేకర్లను వేడి నీళ్లల్లో యాడ్ చేసుకోవాలి. ఈ మిల్ మేకర్లను నీళ్లల్లో 3 నిమిశాల వరకు ఉడికించాలి. మిల్ మేకర్ ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి గెన్నెను పక్కకు తీసుకోవాలి.
2. మిల్ మేకర్‌ను బాగా పిండుకొని వాటిలోంచి నీరంతా బయటకు వచ్చేలా చేసి ఆ మిల్మేకర్లన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి.
3. స్టవ్‌పైన ఒక ప్యాన్‌ను తీసుకొని, అందులో ఒక దాల్చిన చెక్కను, 5 లవంగాలను, 3 యాలాకులను, 1 టేబుల్ స్పూన్ ధనియాలను, 1 టీస్పూన్ మిరియాలను తీసుకోవాలి, మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ల ఎండుకొబ్బరను తీసుకోవాలి. 6 జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ సోంపును యాడ్ చేసుకోవాలి. అర టీస్పూన్ జిలుకరను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
4. ప్యాన్‌లో ఫ్రై చేసిన వాటిని మిక్సీ గ్రైండర్లో వేసుకొని బాగా గ్రైండ్ చేయాలి. ఈ మసాలా పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిక్సర్ గ్రైండర్‌లోకి కట్ చేసిన ఒక టమాటను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

5. ఖాలీ ప్యాన్‌ను స్టవ్‌పైన పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్ల మంచి నూనెను యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయిన తరువాత ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తరువాత అందులోనే ఫ్రెష్‌గా దంచిన అల్లంవెల్లుల్లి పేస్టును వేసుకోవాలి. ఒక నిమిశంపాటు ఫ్రై చేసిన తరువాత అందులో ఇంతకు ముందు గ్రైండ్ చేసిన టమాట పేస్టును యాడ్ చేసుకోవాలి.
6. ప్యాన్‌లో ఫ్రై అవుతున్నా ఉల్లిపాయలో పావు టీ స్పూన్ పసుపును, ఒకటిన్నర టీ స్పూన్ కారంపొడిని యాడ్ చేసుకోవాలి. ఒక టీ స్పూన్ ధనియాల పొడిని, రుచికి సరిపడ ఉప్పును వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో మిల్ మేకర్లను యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా కలిసి 2 నిమిశాలవరకు ప్యాన్‌పై మూత పెట్టి లో ఫ్లేమ్‌లో స్టవ్‌ను ఆన్ చేసి పెట్టాలి.
7. ప్యాన్‌లో తగినన్ని నీళ్లను యాడ్ చేసుకోవాలి. ఇందులోనే గ్రైండ్ చేసిన మసాలా పొడిని వేసుకోవాలి. ప్యాన్‌పై మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 4 నిమిశాల వరకు ఉడికించాలి. కూర మాడిపోకుండా జాగ్రత్త పడాలి. అవసరమైనన్ని నీళ్లను యాడ్ చేసుకోవాలి. కొన్ని కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications