Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
వెజిటేరియన్లు కూడా పడిపడి తినాల్సిందే.. మిల్ మేకర్ ఫ్రై రైస్..!!
సండే అనగానే నాన్‌వెజ్ కాకుండా అప్పుడప్పుడూ వెజ్‌లో ఏవైనా వెరైటీస్ వుంటే కూడా ట్రై చేయాలి. ఎందుకంటే అందరూ నాన్వెజిటేరియన్ కారు. అయితే వెజిటేరియన్లు, నాన్ వెజిటేరియన్లు కలిసి ఇష్టపడేది మిల్మేకర్. ఈ మిల్ మేకర్లు కొంచం మాంసం రుచి వాసన వస్తుంటాయ్. ఇందులో ప్రొటీన్లు కూడా చాలా వుంటాయ్. ఈ వీకెండ్లో మిల్ మేకర్ ఫ్రై రైస్ ఎలా చేసుకోవచ్చో మీ ముందుకు తీసుకొని వచ్చాం.

సోయా ఫ్రైడ్ రైస్ కోసం ఈ కింది పదార్ధాలను రెడీ చేసుకోవాలి.
1 గ్లాసు బాస్మతీ రైస్
అరకప్పు సోయాలు
1/2 టీ స్పూన్ కారంపొడి
1/2 టీ స్పూన్ ధనియాల పొడి
1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు
2 టేబల్ స్పూన్ల మైదాపిండి
2 టేబుల్ స్పూన్ల కార్న్ఫావర్
2 టేబుల్ స్పూన్ల మంచి నూనె
పచ్చిమిరపకాయలు
ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు
2 టేబల్ స్పూన్ల క్యాప్సికం ముక్కలు
1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్
1 టీ స్పూన్ సోయా సాస్
1 టీ స్పూన్ వెనిగర్
అర టీస్పూన్ మిరియాల పొడి

మిల్ మేకర్ ఫ్రై రైస్ ను ఈ విధంగా తయారు చేసుకోండి
1. ఒక గిన్నెలో 1 గ్లాసు వరకు బాస్మతీ బియ్యాన్ని తీసుకోవాలి. మామూలు రైస్ కన్నా బాస్మీతీతోనే ఫ్రై రైస్ చాలా బాగా అవుతుంది. ఈ రైస్‌ను బాగా కడగాలి. బియ్యం తీసుకున్న నాలుగు రెట్ల నీళ్లను పోసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల మంచి నూనెను తీసుకొని అరగంట పాటు ఉడికించాలి.
2. రైస్‌ను బాగా ఉడికేంత వరకు చూసుకోవాలి. ఎక్కువ కలిపితే రైస్ విరిగిపోతుంది. రైస్ ఉడికిన తరువాత నీళ్లను వంపేసుకోవాలి. రెండు గ్లాసుల నీళ్లను తీసుకొని బౌల్లో బాగా వేడిచేయాలి.
3. వేడి నీళ్లల్లో అరకప్పు సోయాలు యాడ్ చేసుకోవాలి. 10 నిమిశాల వరకు ఆ సోయాలను వేడి నీళ్లల్లో నాననిచ్చిన తరువాత వాటిని అందులోంచి తీసుకొని నీళ్లను మొత్తం పిండేసి ఆ మిల్మేకర్లను ఒక బౌల్లోకి తీసుకోవాలి.
4. ఈ సోయాలు వున్న బౌల్లో రుచికి సరిపడ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారంపొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా యాడ్ చేసుకోవాలి. బౌల్లో 2 టేబల్ స్పూన్ల మైదాపిండిని, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫావర్ను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకొని మారినేట్ లాగా చేసుకోవాలి.
5. ఇప్పుడొక ప్యాన్‌లో మిల్మేకర్లను ఫ్రై చేయడానికి తగినంత మంచి నూనెను పోసుకోవాలి. అందులో మారినేట్ చేసిన మిల్మేకర్లను వేసుకోవాలి. ఈ మిల్ మేకర్లన్నింటినీ మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి.
6. ఫ్రై అయిన ఈ మిల్ మేకర్లను టిష్యూపేపర్లోకి తీసుకుంటే వాటిలో వున్న నూనె మొత్తం కిందకు వెళ్లిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల మంచి నూనెను పోసుకోవాలి. ఆయిల్ వేడియిన తరువాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
7. ఇందులోనే కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలను, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును యాడ్ చేసుకోవాలి. 2 టేబల్ స్పూన్ల క్యాప్సికం ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటికి బదులుగా క్యాబేజీ తురుమును, క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు. ఈ మొత్తాన్నీ మరీ ఎక్కువగా కాకుండా మీడియంగా ఫ్రై చేయాలి.
8. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్‌ను యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్‌ను తీసుకొని మిక్స్ చేయాలి. సాస్ మాడిపోకుండా వుండడానికి 2 టేబుల్ స్పూన్ల నీళ్లను యాడ్ చేసుకొని కలుపుకోవాలి.
9. ఇందులోనే ఫ్రై చేసిన మిల్ మేకర్లను యాడ్ చేసుకోవాలి. ఇందులోనే అర టీస్పూన్ మిరియాల పొడిని, రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి. ఇందులోనే ఉడికించిన అన్నాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ మొత్తాన్ని గరిటతో కలపకుండా బౌల్‌ను చిన్నగా ఎగిరేస్లూ కలపాలి, లేదంటే అన్నం విరిగిపోతుంది.
10. పైన కొన్ని కొత్తిమీర ఆకులను వేసుకొని కలుపుకోవడం వల్ల మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. ఇక దీంతో మిల్ మేకర్ ఫ్రై రెడీ అయినట్టే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications