Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Vada Pav: ముంబై ఫేమస్ వడాపావ్ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.. రుచి మాత్రం నెక్స్ట్ లెవల్!
వడాపావ్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. ముంబైలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ స్ట్రీట్ వంటకాన్ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. పెద్ద పెద్ద హీరోలు సైతం ముంబైకి వెళ్ళినప్పుడు దీనిని ఎంత ఇష్టంగా తింటూ ఉంటారు. ఇది చాలా అద్భుతమైన రుచితో ఉంటుంది. అలాగే దీనిని చేసుకోవడం కూడా చాలా సులభం. ముంబై స్టైల్‌లో ఈ వడాపావ్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వడాపావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు
- బంగాళాదుంపలు
- శనగపిండి
- పసుపు
- ఎండు మిరపకాయలు
- కొత్తిమీర
- రుచికి సరిపడా ఉప్పు
- నూనె
- పావ్ బన్స్

వడాపావ్ తయారీ విధానం
ఈ వడాపావ్ తయారు చేసుకోవడానికి ముందుగా బంగాళాదుంపలను బాగా ఉడికించుకోవాలి. అలాగే వాటిని మెత్తగా చేసుకొని పెట్టుకోవాలి. మెత్తగా చేసుకున్న బంగాళాదుంపలు పసుపు, ఎండు మిరపకాయలు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత ఒక బౌల్ తీసుకొని అందులో శనగ పిండిని తీసుకోవాలి. అందులో కొద్దిగా నీరు కలుపుకొని పిండి మాదిరిగా చేసుకోవాలి.
ఆ తరువాత బంగాళాదుంప మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆ ఉండలను వేడి ఫ్రై చేయడానికి నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో బంగాళాదుంప ఉండలను శనగ పిండిలో ముంచుకొని నూనెలో వేయించుకోవాలి. అలా అన్ని ఉండలను వేయించుకున్నాకా.. పావ్ బన్ను తీసుకోవాలి. ఆ బన్నును సగానికి చీల్చుకోవాలి. సగం చీల్చిన తరువాత అందులో బంగాళాదుంప వడను బన్ను మధ్యలో పెట్టుకోవాలి. ఆ తరువాత దానిపై కొత్తిమీర చట్నీ, ఇతర మసాలా సాంబార్‌ను పోసుకోవాలి. అంతే ముంబైలో ఎంతో ఫేమస్ అయిన వడాపావ్ సిద్ధమైనట్లే. దీనిని మీ ఇంట్లోనే ఓసారి ట్రై చేసి రుచి చూడండి. అద్భుతంగా ఉంటుంది అంతే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications