Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
Muntha Masala: స్ట్రీట్ ఫుడ్ లవర్స్ రెండు నిమిషాల్లో ముంత మసాలా ఇలా చేసుకోండి.. చాలా సింపుల్ గురూ!
స్ట్రీట్ ఫుడ్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. రోడ్డు మీద వెళ్తూ వెళ్తూనే పక్కన ఆపేసి స్ట్రీట్ ఫుడ్ తినేస్తుంటారు. అందరికీ ఇష్టమైనది, క్షణాల్లోనే సిద్ధమయ్యేది ముంత మసాలా. పలు రకాల కూరగాయలు, మసాలాలు వేసుకొని దీనిని తయారు చేస్తారు. మన కళ్ళ ముందే రెండు నిమిషాల్లో చేసి ఇచ్చే ఈ ముంత మసాలా రుచి మాత్రం సూపర్ ఉంటుంది. ఈ ముంత మసాలా ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో క్లియర్ కట్‌గా తెలుసుకుందాం.

ముంత మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు
- మురుమురాలు
- కార్న్ ఫ్లేక్స్
- నూనె
- అరకప్పు పల్లీలు
- ఒక ఉల్లిపాయ
- ఒక టమాటో
- రెండు పచ్చిమిర్చి
- ఒక టీస్పూన్ ధనియాల పొడి
- పావు టీస్పూన్ జీలకర్ర పొడి
- అర టీస్పూన్ కారం
- చాట్ మసాలా
- రెండు టేబుల్ స్పూన్ ఆలూ భుజియా
- కొత్తిమీర
- నిమ్మకాయ
ముంత మసాలా తయారీ విధానం
ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాణీ పెట్టుకోవాలి. అందులో మనం తీసుకున్న మురుమురాలను మీడియం మంట మీద వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన మురుములు క్రిస్పీగా తయారవుతాయి. ఆ తరువాత వాటిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాణీలో కొంచెం నూనె పోసుకొని కార్న్ ఫ్లేక్స్ వేయించుకొని పక్కన తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో అరకప్పు పల్లీలలను కూడా వేయించుకొని పక్కన తీసుకోవాలి.
ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మురుమురాలను వేసుకోవాలి. అందులోనే ముందుగానే వేయించి పెట్టుకున్న కార్న్ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. అనంతరం ఆ కార్న్ ఫ్లేక్స్‌ను మెల్లగా చేతితో ప్రెస్ చేస్తూ ఛిద్రం చేసుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా తడుముకున్న ఉల్లిపాయను వేసుకోవాలి. అలాగే సన్నగా తురిమిన టమాటోను కూడా వేసుకోవాలి.
ఇప్పుడు అందులోనే రెండు పచ్చి మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే పావు టీస్పూన్ జీలకర్ర పొడి, ఒక టీస్పూన్ ధనియాల పొడి, ఒక టీస్పూన్ కారం పొడి, ఒక టీస్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆలు భుజియా, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక చిన్న నిమ్మకాయ కూడా పిండుకోవాలి. దానిపై ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని, అన్నిటినీ బాగా కలుపుకోవాలి. మురుమురాలకు మసాలాలు అన్నీ కలిసే విధంగా కలుపుకుంటే ముంత మసాలా సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications