మన పూర్వీకులు తిన్న వడలు ఇవే..బాహుబలి శక్తి..ఎలా చేసుకోవాలంటే

Posted By:

దక్షిణ భారతదేశంలో చాలామంది బ్రేక్ ఫాస్ట్ లోకి వడలను ఎక్కువగా తింటుంటారు. అయితే వడలను చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మినపప్పు నానబెట్టి దాన్ని రుబ్బుకోవాలి,ఆ తర్వాత వడలు వేసుకోవాలి. అయితే ఇదంతా అవసరం లేకుండా మరమరాలు ఉంటే 10 నిమిషాల్లోనే క్రిస్పీ వడలు చేసుకోవచ్చు. మరమరాలతో చేసే వడల టేస్ట్​ మినప వడలను మించి ఉంటుంది. మరమరాల వడ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

మరమరాల వడ తయారీకి కావీల్సిన పదార్థాలు

-మరమరాలు
-కొత్తిమీర
-కరివేపాకు
-అల్లం
-ఉప్పు
-జీలకర్ర
-పెరుగు
-బియ్యం పిండి
-ఆయిల్

how to make murmura vada at home recipe in telugu

మరమరాల వడ తయారీ విధానం

-ముందుగా ఒక బౌల్ లో మూడు కప్పుల మరమరాలు పోయండి. అందులోనే కొంచెం నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టండి.

-తర్వాత నీళ్లు మొత్తం పారబోసి మరమరాలను కొంచెం లైట్ గా మాష్ చేసుకోవాలి.

-అందులోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు, ఉప్పు, జీలకర్ర, బియ్యం పిండి, పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. తడి సరిపోకుంటే కొంచెం పెరుగు లేదా నీళ్లు యాడ్ చేసుకోండి.

-తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని కలిపిన పిండిని కొంచెం చేతుల్లోకి తీసుకొని వడల షేపులో వత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ ని వేడి చేసిన తర్వాత అందులో వీటిని వేయండి. బాగా కలర్ వచ్చేవరకు వేయించుకొని తీసేస్తే చాలు. అంతే టేస్టీ మరమరాల వడలు రెడీ.

[ of 5 - Users]
Desktop Bottom Promotion