రుచికరమైనదే కాదు పోషకాల నిధి..మటన్ ఖీమా ఇలా చేస్తే లొట్టలేసుకొని ఆరగిస్తారు

Posted By:

మటన్ ఖీమా రుచికరమైన వంటకమే కాకుండా పోషకాలతో నిండి ఉంటుంది. మటన్ కీమాలో ప్రోటీన్లు, ఐరన్, జింక్, విటమిన్ బి12, నియాసిన్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగపర్చేందుకు,మెదడు పనితీరుని మెరుగుపర్చేందుకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి, రక్తహీనతను నివారించడంలో మటన్ ఖీమా సహాయపడుతుంది. ఇంట్లోనే ఈజీగా మటన్ ఖీమా తయారు చేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, మటన్ ఖీమా తయారీ విధానం ఇక్కడ చూడండి.

మటన్ ఖీమా తయారీకి కావాల్సిన పదార్థాలు
-మటన్ ఖీమా
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-బిర్యానీ ఆకు
-ఉప్పు
-పసుపు
-గరం మసాలా
-కారం
-ధనియాల పొడి
-కొత్తిమీర
-కరివేపాకు
-అల్లంవెల్లుల్లి పేస్ట్

how to make mutton keema recipe in telugu

మటన్ ఖీమా తయారీ విధానం
-ముందుగా 400 గ్రాముల మటన్ ఖీమాని శుభ్రంగా కడిగి వడగిన్నెలో వేసి పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయండి.

-ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 2 పచ్చిమిర్చి చీలికలు, 2 బిర్యానీ ఆకులు, సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయల ముక్కలు,కొంచెం కరివేపాకు వేసి వేపండి.

-ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పుసుపు వేసి కలిపి అందులోనే మటన్ ఖీమా వేసి కలిపి మూత పెట్టి 3-4 నిమిషాల పాటు ఉడకనివ్వండి.

-తర్వాత మూత తీసి బాగా కలిపి అందులో రెండు టీ స్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, సరిపడా కారం, 1 టీస్పూన్ ధనియాల పొడి, సరిపడా ఉప్పు,కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలపాలి.

-2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో అరకప్పు వాటర్ పోసి కుక్కర్ మూతపెట్టేయండి.

-5-6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. మూత తీసి అందులో కొంచెం కొత్తిమీర చల్లుకోండి అంతే టేస్టీ మటన్ ఖీమా రెడీ.

-అన్నం, చపాటీ, రోటీ దేంట్లోకైనా ఇది సైడ్ డిష్ గా కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Friday, January 10, 2025, 13:34 [IST]
Desktop Bottom Promotion