Latest Updates
-
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం
నాటు కోడికూరను ఈ స్టైల్లో చేస్తే..లొట్టలేసుకుంటూ తినేస్తారంతే..!
చికెన్ వెరైటీల్లో నాటుగా, రుచిగా వుండేది నాటుకోడి పులుసు. అన్నంలో ఈ నాటుకోడి పులుసును కలుపుకొని తింటే ఆ మజా మాటల్లో చెప్పలేము. కాల్చిన నాటుకోడి మాంసంతో నాటుకోడి పులుసును చేసుకుంటాం. ఈ సారి నాటుకోడి రెసిపీని మీ ముందుకు తీసుకొని వచ్చాము. ఈ వీకెండ్‌లో ఈ నాటుకోడి పులుసు రెసిపీని ట్రై చేయండి.

నాటుకోడి పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన వంట సామాగ్రి
1 కేజీ నాటు కోడి మాంసం
1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు
మంచి నూనె
1 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 5 యాలాకులు
1 కప్పు తరిగిన ఉల్లిపాయ
కొన్ని కరివేపాకులు
1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు
తగినంత కారంపొడి
2 మీడియం సైజు టమాటలు
4 పచ్చిమిరపకాయలు
1 టీ స్పూన్ గరం మసాలా పొడి
సన్నగా తరిగిన కొత్తిమీర

నాటుకోడి పులుసు తయారీ విధానం
ముందుగా 1 కేజీ నాటుకోడి మాంసాన్ని తీసుకోవాలి.
ఈ నాటుకోడి ముక్కలను నీళ్లతో రెండు, మూడు సార్లు బాగా కడగాలి.
1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ మంచి నూనె
వేసి ముక్కలన్నింటికీ బాగా పట్టించాలి.
స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల మంచి
నూనెపోసుకోవాలి.
వేడవుతున్న నూనెలో రెండు బిర్యానీ ఆకులు, ఒక ఇంచు దాల్చిన చెక్క, 5
లవంగాలు, 3 యాలాకులు వేసి ఫ్రై చేయాలి.
1 కప్పు ఉల్లిపాయ ముక్కలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి.
కొన్ని కరివేపాకులను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని పచ్చి వాసన
పోయేంతవరకు ఫ్రై చేయాలి.
ఉప్పు, పసుపు, నూనె అద్దుకున్న చికెన్ ముక్కలను కూడా వేసి మొత్తం
కలుపుకోవాలి.
చికెన్ ముక్కలు సగం ఉడికేంత వరకు విజిల్ పెట్టుకోవాలి.
1 టేబుల్ స్పూన్ కారంపొడిని యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, పసుపును
కూడా వేసుకోవాలి.
2 మీడియం సైజు టమాటలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి.
3 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి.
కూరలో 1 కప్పు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 6 విజిల్స్ వచ్చేంతవరకు
ఆగాలి.
గ్రేవీ ఎంత కావాలో అన్ని నీళ్లను పోసుకోవాలి.
1 టీస్పూన్ గరంమసాలా పొడిని యాడ్ చేసుకోవాలి.
సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి.
5 నిమిశాలు మళ్లీ ఉడికిస్తే నాటు కోడి పులుసు రెడీ అయినట్టే
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications